చిదంబరానికి ఊరట.. బెయిల్ తో బయటకు!

దాదాపు వంద రోజుల నుంచి జైల్లో ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బెయిల్…

దాదాపు వంద రోజుల నుంచి జైల్లో ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బెయిల్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు చిద్దూ. ఈ క్రమంలో ఆయనకు సుప్రీం కోర్టు ఊరటను ఇచ్చింది. షరతులతో కూడిని బెయిల్ ను ఆయనకు మంజూరు చేసింది న్యాయస్థానం.

మొత్తం నూటా ఆరు రోజుల పాటు చిదంబరం జైల్లో గడిపారు. ఆయన సీబీఐ, ఈడీలు అదుపులోకి తీసుకున్నాయి. ఇప్పటికే ఒక కేసులో బెయిల్ వచ్చింది, ఇప్పుడు ఈడీ నుంచి  కూడా ఆయనకు సుప్రీం కోర్టు విముక్తి కల్పించింది. దీంతో చిదంబరం తీహార్ నుంచి విడుదల అవుతున్నారు.

ఈ సందర్భంగా న్యాయస్థానం ఆయనకు కొన్ని షరతులు విధించింది. విదేశాలకు వెళ్లకూడదని, తనపై నమోదు అయిన కేసుల గురించి మీడియాతో మాట్లాడకూడదని న్యాయస్థానం చిదంబరాన్ని ఆదేశించింది. రెండు లక్షల రూపాయల పూచికత్తు మీద ఆయనను విడుదల చేసినట్టుగా సమాచారం.

తీహార్ జైల్లో ఉన్నా .. చిదంబరం తన తరఫున తన వాళ్లు ట్వీట్లు పెడతారంటూ వివిధ అంశాల మీద స్పందించారు. రెండు రోజుల క్రితం ఆయన ట్విటర్లో ఖాతా నుంచి..ఇండియా ఆర్థిక వ్యవస్థను దేవుడే కాపాడాలంటూ పోస్టు చేశారు.

ఎంతోమంది కాంగ్రెస్ వ్యతిరేకులను చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడే జైలుకు పంపించారు. ఆయన నూటా ఆరు రోజుల పాటు జైల్లో గడిపి ఇప్పుడు బయటకు వచ్చారు. అయితే ఈ కేసుల్లో ఆయన విచారణకు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉండొచ్చు.