ఆలియా భట్ వస్తోంది

మొత్తానికి కరోనా అనంతరం కదలిక వస్తోంది ఆర్ఆర్ఆర్ సినిమాలో. టాలీవుడ్ భారీ సినిమా ఆర్ఆర్ఆర్ అన్నింటికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయింది కరోనా కారణంగా. సినిమా 2020 సమ్మర్ అనుకున్నది ముందుగానే వాయిదా పడి దసరాకు…

మొత్తానికి కరోనా అనంతరం కదలిక వస్తోంది ఆర్ఆర్ఆర్ సినిమాలో. టాలీవుడ్ భారీ సినిమా ఆర్ఆర్ఆర్ అన్నింటికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయింది కరోనా కారణంగా. సినిమా 2020 సమ్మర్ అనుకున్నది ముందుగానే వాయిదా పడి దసరాకు ఆపై 2021 సంక్రాంతికి వెళ్లింది.

కరోనా కారణంగా అక్కడి నుంచి జరిగి మళ్లీ 2021 దసరాకు వెళ్తోందని వార్తలు వినవస్తున్నాయి. పోస్ట్ కరోనా నేపథ్యంలో అన్ని సినిమాలు ఒక్కోటీ షూటింగ్ ప్రారంభం అవుతున్నాయి. పెద్ద హీరోలు దాదాపు అందరూ కూడా అక్టోబర్ లో కొందరు, నవంబర్ లో మరికొందరు సెట్ ల మీదకు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ కూడా అక్టోబర్ నుంచి షెడ్యూళ్లు వేసుకుంది. హీరోలు మాత్రం నవంబర్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. హీరోల సంగతి ఎలా వున్నా, సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఆలియా భట్ నవంబర్ లో సెట్ కు వస్తానని చెప్పినట్లు, ఆ మేరకు షెడ్యూళ్లు వేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఇప్పటి వరకు షూట్ చేసిన పార్ట్ లకు సంబంధించి సిజి వర్క్ లు పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. అయినా ఎంత ఫాస్ట్ గా చేసినా కూడా ఆర్ఆర్ఆర్ సమ్మర్ విడుదల అసాధ్యం అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

ఎన్టీఆర్ ను ఫిబ్రవరి నాటికి, రామ్ చరణ్ మార్చి తరువాత తన ప్రాజెక్టు నుంచి రిలీవ్ చేస్తానని రాజమౌళి మాట ఇచ్చారని తెలుస్తోంది. కానీ అది సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఎప్పుడు పూర్తవుతుందా? ఎప్పుడు తమ సినిమాలు స్టార్ట్ చేద్దామా అని డైరక్టర్లు త్రివిక్రమ్, కొరటాల శివ వెయిటింగ్ లో వున్న సంగతి తెలిసిందే.

చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న అమరావతి

బోండా ఉమకి నిన్న రాత్రే ఎలా తెలిసిపోయింది