రేటింగ్స్ లో బిగ్ బాస్ సత్తా చాటింది కానీ..

బిగ్ బాస్ ఫార్ములాకు తిరుగులేదని మరోసారి రుజువైంది. ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ప్రసారం చేసినా ఈ రియాలిటీ షోకు రేటింగ్ గ్యారెంటీ అనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. అవును.. సీజన్-4లో కూడా బిగ్…

బిగ్ బాస్ ఫార్ములాకు తిరుగులేదని మరోసారి రుజువైంది. ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ప్రసారం చేసినా ఈ రియాలిటీ షోకు రేటింగ్ గ్యారెంటీ అనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. అవును.. సీజన్-4లో కూడా బిగ్ బాస్ మెరిశాడు. ఈ రియాలిటీ షో ఆరంభ ఎపిసోడ్ కు అత్యథికంగా 18.5 (ఏపీ+తెలంగాణ అర్బన్) టీఆర్పీ వచ్చింది.

నిజానికి ఈ కార్యక్రమానికి ఈసారి ఇంతకంటే ఎక్కువ రేటింగ్ పోటెత్తుతుందని భావించారు స్టార్ మా నిర్వహకులు. ఎందుకంటే లాక్ డౌన్ లో అంతా టీవీలకే అతుక్కుపోయి, అలవాటు పడ్డారు. ఈమధ్య ఇదే ఛానెల్ లో టెలికాస్ట్ అయిన కొన్ని సినిమాలు రేటింగ్స్ లో చరిత్ర సృష్టించాయి.

అదే ట్రెండ్ బిగ్ బాస్ సీజన్-4లో కూడా కనిపిస్తుందని భావించారు. 20 మార్క్ దాటి రేటింగ్ వస్తుందనుకున్నారు. కానీ హైదరాబాద్ లో మినహా, ఓవరాల్ గా ఆ మార్క్ అందుకోలేకపోయాడు బిగ్ బాస్. మరోవైపు ప్రారంభ ఎపిసోడ్ మినహా సోమవారం నుంచి ప్రసారమైన వీక్ డేస్ ఎపిసోడ్స్ ఏవీ జనాదరణ పొందలేకపోయాయి. దీంతో ఓవరాల్ గా బిగ్ బాస్ టీఆర్పీ ఊహించిన దానికంటే తగ్గింది. 

సీజన్-2, సీజన్-3 బిగ్ బాస్ కార్యక్రమాలు టాప్ లో నిలిచాయి. రేటింగ్స్ లిస్ట్ లో ఫస్ట్ అవే కనిపించేవి. కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ కు ఆ ఘనత దక్కలేదు. ఎప్పట్లానే కార్తీకదీపం మెగా సీరియల్ మొదటి 6 స్థానాల్లో నిలవగా.. ఆ తర్వాత ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత మాత్రమే బిగ్ బాస్ కు స్థానం దక్కింది. ఇవన్నీ స్టార్ మా కార్యక్రమాలే కావడం విశేషం. 

చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న అమరావతి

బోండా ఉమకి నిన్న రాత్రే ఎలా తెలిసిపోయింది