విశాఖకు ఆ ముప్పు ఉందా?

విశాఖనగరం అందమైనది అంటారు. కూల్ సిటీ అని చెబుతారు మెగా సిటీ అని కూడా కితాబులు ఇస్తారు. అయితే విశాఖ సిటీ వరకూ ఓకేగా ఉన్నా ఏపీలో ఉన్న పదమూడు జిల్లాలలో  తూర్పు గోదావారి…

విశాఖనగరం అందమైనది అంటారు. కూల్ సిటీ అని చెబుతారు మెగా సిటీ అని కూడా కితాబులు ఇస్తారు. అయితే విశాఖ సిటీ వరకూ ఓకేగా ఉన్నా ఏపీలో ఉన్న పదమూడు జిల్లాలలో  తూర్పు గోదావారి తరువాత భౌగోళికంగా పెద్దది. పైగా ఏజెన్సీ ప్రాంతం కూడా ఎక్కువ.

దాంతో వామపక్ష తీవ్రవాదం విశాఖ జిల్లాకు అతి పెద్ద సమస్యగా ఉంది. ఒడిషా నుంచి విశాఖ వరకూ ఉన్న ప్రాంతం మావోలకు పట్టుకొమ్మగా చెబుతారు. ఇపుడు కేంద్రం కూడా మరోసారి విశాఖకు ఆ ముప్పు ఉందని నివేదిక ఇచ్చింది.

ఏపీలో విశాఖను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా పరిగణిస్తున్నట్లుగా కేంద్ర హోం శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో భద్రతాపరమైన ఖర్చు కింద గత అయిదేళ్లతో 95 కోట్లు ఏపీకి విడుదల చేసినట్లుగా కూడా హోం శాఖ పేర్కొంది.

ఈ మొత్తంతో మావోల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో  జనజీవన స్రవంతిలో కలిసే వారికి నెలకు  స్టైఫండ్ గా ఆరు వేల రూపాయల మొత్తాన్ని  ఈ నిధుల నుంచే వెచ్చిస్తారు. ఇదిలా ఉంటే ఈమధ్యనే ఆంధ్ర ఒడిషా బోర్డర్ లో అమర్చిన సీసీ కెమెరాలా ద్వారా మావోల కదలికలను కూడా పోలీస్ వర్గాలు గుర్తించాయి. 

ఇక ఒక మంత్రికి మావోల నుంచి ముప్పు ఉందని కూడా ఇంటలిజెన్స్ వర్గాలు నిఘా పెంచాయి. మొత్తానికి మావోల తాకిడి విశాఖ జిల్లాకు ఇప్పటికి ముప్పుగానే ఉందని నివేదికలు చెబుతున్నాయి.

చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న అమరావతి

బోండా ఉమకి నిన్న రాత్రే ఎలా తెలిసిపోయింది