టీడీపీ నారాయణకు షాకిచ్చిన విద్యార్థి సంఘాలు!

ఒకవైపు ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ, మరోవైపు విద్యా వ్యాపారం చేశారు నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో.. నారాయణ, శ్రీ చైతన్య వంటి విద్యా సంస్థల చదువుల దోపిడీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. అలా…

ఒకవైపు ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ, మరోవైపు విద్యా వ్యాపారం చేశారు నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో.. నారాయణ, శ్రీ చైతన్య వంటి విద్యా సంస్థల చదువుల దోపిడీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. అలా కోటీశ్వరుడు అయిన నారాయణ.. తన విద్యా వ్యాపార సామ్రాజ్యం ద్వారా రాజకీయానికి బాటలు వేసుకున్నారు. ప్రజల నుంచి ఆయన ఎన్నిక కాకుండానే మంత్రి అయ్యారు!

ఐదేళ్ల పాటు చక్రం తిప్పారు. తీరా తెలుగుదేశం చిత్తు అయ్యాకా ఆయన సైలెంట్ అయ్యారు. ఈ పరిణామాల్లో అనంతపురం పర్యటనకు వెళ్లిన ఆయనకు అక్కడ విద్యార్థి సంఘాల నుంచి ఝలక్ తగిలింది. నారాయణ కళాశాలల్లో ఫీజులను తగ్గించాలని విద్యార్థి సంఘాల వాళ్లు నారాయణకు మొదట మర్యాదపూర్వకంగానే విన్నపం చేశారు. నిబంధలను ఖాతరు చేయకుండా రకరకాల రూపాల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని అది పద్ధతి కాదని వారు ఆయనకు సూచించారు.

వారిని ఖాతరు చేయలేదు నారాయణ. 'మాట్లాడదాం.. మాట్లాడదాం..' అంటూ ఆయన వారిని తోసుకుని ముందుకు వెళ్లబోయారు. దీంతో తోపులాట మొదలైంది. ఆ వెంటనే నారాయణ అనుచరులు రౌడీయిజం చేశారు. విద్యార్థి సంఘాల వాళ్లను పక్కకు తోసి, ఆ మాజీ మంత్రిని తీసుకెళ్లబోయారు. విద్యార్థి సంఘాల వాళ్లపై నారాయణ మనుషులు దాడి కూడా మొదలైంది.

ఆ క్రమంలో తోపులాటలో నారాయణ కూడా పక్కకు నెట్టివేయబడ్డారు. ఆయన చొక్కా కూడా చిరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ విద్యావ్యాపారి రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లూ దర్జాగా చలామణి అయ్యారు కానీ, ఇప్పుడు మాత్రం ఈ తరహా నిరసనలకు తప్పేలా లేవు.