cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

ముందు తెలుగు నేర్చుకో పవన్!

ముందు తెలుగు నేర్చుకో పవన్!

పవన్ కల్యాణ్ తాను జ్ఞానిని అని చెప్పుకుంటూ ఉంటారు. తనకు జ్ఞానం ఉన్నదని ఆయనకు తెలిసిపోయింది. అలాగే... తతిమ్మా  రాజకీయ నాయకులు అందరూ కూడా.. జ్ఞానం లేని వారు అని కూడా ఆయనకు తెలిసిపోయింది. కాబట్టి.. జ్ఞాని అయిన పవన్ కల్యాణ్ ఏం చెబితే అది జ్ఞానం అని మనం అనుకోవాలి.

ఖర్మగాలి నిజం అనుకున్నామంటే మాత్రం పప్పులో కాలేసినట్లే!  పవన్ కల్యాణ్.. ఏదో జగన్మోహనరెడ్డిని చూసి ఓర్వలేక ఉన్మాదంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన ఎంత మతిలేని మాటలు మాట్లాడుతున్నారో... జగన్ మాటలను ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారో గమనిస్తే.. పవన్ కు కనీసం తెలుగు భాషలోని లోతు కూడా అర్థం కావడం లేదని తెలిసిపోతుంది.

జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మానవత్వమే తన మతం అని, మాట తప్పకపోవడమే తన కులం అని అన్నారు. సాధారణంగా బుర్రలో కాస్త గుజ్జు ఉన్న ఎవడికైనా సరే... ఈ మాటల్లో ఒకే ఒక అర్థం కనిపిస్తుంది.

‘‘ఆ మాటలు చెప్పిన వ్యక్తి కులమతాలను పట్టించుకునే వాడు కాదు... మానవత్వాన్నే తన మతంగా భావించే వాడు.. మాట తప్పక పోవడాన్నే కులంగా భావించేవాడు’’ అని! అచ్చంగా ఆ మాటల్లో ఉండే అర్థం అదే!

కానీ, తనను తాను తెలుగు భాషా ఉద్ధారకుడిలాగా ప్రొజెక్టు చేసుకుంటూ.. దివినుంచి దిగివచ్చిన భాషారక్షకుడిలాగా.. ఆవేశపడిపోతూ ఉండే పవన్ కల్యాణ్ కు మాత్రం.. ఈ తేలిక మాటలు కూడా సాఫీగా అర్థం కాలేదు.

జగన్ మాటల గురించి ఆయన కౌంటర్ విమర్శలు చేస్తూ.. ‘‘మాటతప్పక పోవడమే నా కులం అని జగన్ అంటున్నారంటే.. మిగిలిన కులాల వాళ్లంతా మాట తప్పేవారా...?’’ అని ప్రశ్నిస్తున్నారంటే.. ఆయన ఎంతగా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ‘మానవత్వమే నా మతం అని జగన్ అంటే.. దాని అర్థం మిగిలిన మతాల వాళ్లంతా మానవత్వం లేని వారనేనా?’ ఇంత మూర్ఖమైన  వక్రభాష్యాలు చెప్పాలనే ఆలోచన పవన్ కల్యాణ్ కు ఎలా వచ్చింది?

తెలుగు భాషను ఉద్ధరించే సంగతి తర్వాత.. తాను తెలుగు కవిత్వం విపరీతంగా చదివేస్తానని బిల్డప్ లు ఇవ్వడం తరువాత... ముందు పవన్ కల్యాణ్ తెలుగు మాటలను వాటి సహజమైన రీతిలో అర్థం చేసుకోవడం నేర్చుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు.