జగన్ సైలెంట్ గా చేస్తున్నారుగా?

జగన్ ఎక్కువగా మాట్లాడరు, ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన పాలనే మాట్లాడుతోంది తప్ప తానుగా బయటకు వచ్చి భారీ ప్రకటనలు చేసింది లేదు. ఇది చేశాను, అది చేశాను అని గొప్పలు చెప్పుకోవడంలేదు. Advertisement…

జగన్ ఎక్కువగా మాట్లాడరు, ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన పాలనే మాట్లాడుతోంది తప్ప తానుగా బయటకు వచ్చి భారీ ప్రకటనలు చేసింది లేదు. ఇది చేశాను, అది చేశాను అని గొప్పలు చెప్పుకోవడంలేదు.

జపాన్ కి చెందిన యకొహమా గ్రూప్ వారి అలియెన్స్ టైర్స్ గ్రూప్ తన మూడవ ప్లాంట్ ని విశాఖపట్నంలో పెట్టడానికి రెడీ అవుతోంది. విశాఖ వంటి మెగాసిటీని ఎంచుకుని మరీ  1250 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తోంది.

దీని వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విభజన తరువాత  విశాఖకు ఇప్పటిదాకా సాలిడ్ గా చెప్పుకోవాల్సిన భారీ  పెట్టుబడి ఇదేనని చెప్పాలి. చంద్రబాబు హయాంలో వరసగా ప్రతీ ఆరు నెలలకూ ఓసారి వైజాగ్ వేదికగా  పెట్టుబడుల సదస్సులు నిర్వహించినా కూడా విశాఖ నగరానికి పెట్టుబడులు ఒక్కటీ రాని సంగతి తెలిసిందే.

ఇపుడు జగన్ సర్కార్ వచ్చి ఏడాదిన్నర కాలేదు కానీ ఒక మంచి రెపుటేషన్ ఉన్న ఏటీజీ ప్లాంట్ విశాఖకు రావడం అంటే విశేష పరిణామమే. అంటే జగన్ సైలెంట్ గా చేస్తున్న వర్క్ కి ఇది పక్కా రిజల్ట్ అనుకోవాలి. 

ఇదే ప్లాంట్ చంద్రబాబు టైంలో వచ్చి ఉన్నట్లైతే ఈపాటికి విశాఖ కాదు, ఏపీ మొత్తం ఊగిపోయేలా ప్రచార‌ హడావుడి అయితే చేసేవారు అన్నది నిజం. ఏది ఏమైనా పని మాత్రమే మాట్లాడుతుంది, అదే జనాలకు నచ్చుతుంది. జగన్ చేస్తున్నది కూడా ఇదే.

నాగ‌బాబూ …మ‌రీ ఇంత దిగ‌జారుడేంది?

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా