cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగా బ్ర‌ద‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌

మెగా బ్ర‌ద‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా నాగ‌బాబు వెల్ల‌డించారు. ‘ఒక వ్యాధి వచ్చిందని బాధగా ఉండడం కాదు. దాని నుంచి కోలుకుని వేరొకరి సాయం చేయాలి. కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సరైన జాగ్రత్తలు పాటించి.. కరోనాని జయించి.. ప్లాస్మా దాతగా మారతాను’ అని నాగబాబు పేర్కొన్నారు.

దీంతో మెగా అభిమానులు నాగబాబు త్వ‌ర‌గా కోలుకుని రావాల‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రెండుమూడు రోజుల‌కు ఒక‌సారి ఏదో ఒక అంశంపై నాగ‌బాబు వీడియోలు పెడుతుండ‌డాన్ని చూస్తున్నారు. అలాగే త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సంబంధించి పాత ఫొటోల‌ను ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ ...పాత రోజుల్ని గుర్తు చేస్తూ అభిమానుల‌కు వినోదాన్ని పంచుతున్నారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి చిన్న‌ల్లుడు , హీరో క‌ల్యాణ్‌దేవ్ సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ నాగ‌బాబు ఆరోగ్యంగా రావాల‌ని కోరు కున్నారు. ‘నాగబాబు మామయ్య మీరు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ క‌ల్యాణ్‌దేవ్ కామెంట్‌ చేశారు. నాగ‌బాబు త్వ‌ర‌గా కోలుకుని య‌ధావిధిగా త‌న ప‌నుల్లో బిజీ కావాల‌ని కోరుకుందాం.  

నాగ‌బాబూ ...మ‌రీ ఇంత దిగ‌జారుడేంది? 

 


×