ఏపీలో ప్రస్తుత రాజకీయలు మొత్తం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతోంది. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ- జూనియర్ ఎన్టీఆర్‌కు ముడి పెడుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఖండించట్లేదు. దీన్ని బట్టి టీడీపీ భవిష్యత్ దబిడి దిబిడే అని సృష్టంగా తెలుస్తోంది.. అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు లేకపోతే టీడీపీ లేదనే భావనతో ఆర్జీవీ ట్వీట్ చేశారు. కాగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుండి నందమూరి కుటుంబ సభ్యులు అందరు ఆయన అరెస్ట్‌ను ఖండిస్తున్న జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నుండి ఎటువంటి స్పందన రావడం లేదు.
దీంతో చంద్రబాబు సామాజిక వర్గ టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్‌తో పాటు టాలీవుడ్‌ను కూడా టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పని చేయించుకొని.. సంపాదించుకున్న వారు ఎవరు ఇప్పుడు నోరు మెదపట్లేదు అని సోషల్ మీడియాలోనూ.. మీడియా ముందు వాపోతున్నారు.
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అవగానే సినిమా షూటింగ్ వదులుకొని మరి ఏపీ వచ్చి హైడ్రామా నడిపించారు జనసేన అధినేత. దీంతో లోకేష్‌తో పాటు బాలకృష్ణ కూడా ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. మరోవైపు జాతీయ స్థాయిలో చంద్రబాబు ద్వారా లబ్ధి పొందిన నాయకులు చంద్రబాబు అరెస్టుపై ట్వీట్లు చేస్తున్నారు.