కరోనా, లాక్ డౌన్ లు లేకపోయి ఉంటే.. ఈ రోజులన్నీ మరోలా గడిచేవి! ఆస్వాధించగలిగే వాళ్లకు ప్రతి రోజూ అందంగానే ఉంటుంది. ప్రత్యేకించి సోషల్ మీడియాలో అయితే ఆ హడావుడే వేరు! సమ్మర్ వెకేషన్లు, మాన్ సూన్ లో విహారాలు.. అదంతా వేరే కథ. అయితే లాక్ డౌన్ లతో నెలలుగా చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో వారు అందించే ఎంటర్ టైన్ మెంట్ కూడా మిస్.
అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితి కాస్త మారుతున్నట్టుగా ఉంది. సెలబ్రిటీలు ఇళ్లు దాటుతున్నారు. బీచ్ లకు చేరుతున్నారు. అక్కడ నుంచి పోజులు ఇస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు గోవా చేరిపోయినట్టుగా అప్ డేట్ ఇస్తున్నారు. అక్కడ బీచ్ లలో, బీచ్ లకు అనుకుని ఉన్న తమ విల్లాల్లో దిగిన ఫొటోలను పోస్టు చేస్తున్నారు.
ఈ క్రమంలో కత్రినా కైఫ్ కూడా ఈ తరహాలో హాజరీ వేయించుకుంటోంది. సోషల్ మీడియాలో హాట్ పోజులతో పోస్టులు పెడుతూ ఉంది. వైట్ బీచ్ వేర్ లో స్టన్నింగ్ పోజులను పోస్టు చేస్తూ ఉంది. ఇలా లాక్ డౌన్ రోజులు పోయాయి.. పాత రోజుల దిశగా సాగుతున్నట్టుగా తన ఫాలోయర్లకు సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని ఇస్తోంది. వీటికి లక్షల కొద్దీ లైకులు!