మొత్తానికి అచ్చెన్నకు చుక్కలు చూపిస్తున్నారుగా…!

చంద్రబాబు ముహూర్తం కోసం చూస్తున్నారు కానీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రేపో మాపో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. అంతేనా అసెంబ్లీలో టీడీపీ ఉప నాయకుడు. ఫైర్ బ్రాండ్. ఇన్ని ఉండి కూడా సొంత నియోజకవర్గం…

చంద్రబాబు ముహూర్తం కోసం చూస్తున్నారు కానీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రేపో మాపో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. అంతేనా అసెంబ్లీలో టీడీపీ ఉప నాయకుడు. ఫైర్ బ్రాండ్. ఇన్ని ఉండి కూడా సొంత నియోజకవర్గం టెక్కలిలో అధికారులు లెక్కచేయపోతే మాజీ మంత్రికి కోపం రాదా.

అదే ఇపుడు జరుగుతోంది. మూడు నెలల పాటు అచ్చెన్న ఇఎస్ఐ స్కాం లో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు. ఆ తరువాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు .ఇంతలోనే ఆయన గెలిచిన టెక్కలిలో సీన్ మొత్తం మారిపోయింది. వైసీపీ ఇంచార్జి తో కధ మొత్తం నడిచిపోతోంది.

ఆయనే అసలైన  ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు. దాంతో మండుకొచ్చిన అచ్చెన్న టెక్కలిలో అసలేం జరుగుతోంది. నాకు అంతా తెలియాలి అంటున్నారుట. అయితే దానికి అధికారులు మాత్రం ఏం జవాబు చెబుతారు. అది చంద్రబాబు గారు రూలింగులో ఇచ్చిన ఫర్మానావే కదా. చల్లగా అలా అమలు అయిపోతోంది మరి.

తమ పార్టీ గెలవని చోట ఇంచార్జిలను పెట్టి మరీ వారినే ఎమ్మెల్యేలుగా చూపించి బాబు చక్రం అప్పట్లోతిప్పేవారు. వారినే ముందు పెట్టి ఏకంగా నియోజకవర్గం అభివ్రుధ్ధి నిధులు కూడా ఇచ్చేవారు. సేమ్ టూ సేమ్ ఇపుడు అలాగే జరుగుతోంది. ఇది బాబు గారు వేసిన పొలిటికల్ రూటే. మీరు నేర్పిన విద్యయే కదా అని అధికారులు తాపీగా జవాబు చెబుతున్నారుట .

మొత్తానికి అయిదేళ్ళ పాటు తాము పవర్లో ఉండగా తెచ్చిన విధానమే చివరకు తనకే  ఇరకాటం అవుతుందని అచ్చెన్న గ్రహించేసరికి దువ్వాడ శ్రీనివాస్ అనబడే వైసీపీ ఇంచార్జి టెక్కలి మొత్తాన్ని దున్నేస్తున్నాడుట. ఇదీ అచ్చెన్న బాధ. ఎవరూ ఆర్చలేనిదీ తీర్చలేని బాధ  కూడా.

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

ఆ జోష్ వైసీపీకి ఇప్పట్లో వస్తుందా?