బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కు మార్కెట్ సమస్య

బాలకృష్ణ-బోయపాటి శ్రీను.. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇది. ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి సింహా, లెజెండ్ లాంటి హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ కోసం ప్రయత్నం. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అది…

బాలకృష్ణ-బోయపాటి శ్రీను.. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇది. ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి సింహా, లెజెండ్ లాంటి హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ కోసం ప్రయత్నం. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అది మార్కెట్లో హాట్ కేక్ అన్నట్టే. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది.

బాలయ్య-బోయపాటి సినిమాకు సంబంధించి ఇంకా శాటిలైట్ డీల్ పూర్తికాలేదు. స్టార్ హీరోల సినిమాలకు సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్ డీల్స్ క్లోజ్ అవుతాయి. ఉదాహరణకు మహేష్ మూవీ సర్కారువారి పాట సినిమా శాటిలైట్ రైట్స్ ఆల్రెడీ అమ్ముడుపోయాయి. అలాంటిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నప్పటికీ.. ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తయినప్పటికీ.. బాలయ్య మూవీకి ఇంకా డీల్ ఓకే కాలేదు.

బాలయ్య-బోయపాటి సినిమాకు డీల్ సెట్ అవ్వకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి భారీ రేటు. హ్యాట్రిక్ మూవీ కావడంతో కాస్త ఎక్కువ మొత్తానికి అమ్మడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కరోనాతో మారిన పరిస్థితుల నేపథ్యంలో అంత మొత్తం కేటాయించడానికి ఛానెళ్లు వెనకడుగేస్తున్నాయి.

ఇక మరో ప్రధాన కారణం ఏంటంటే.. ప్రస్తుతం ఛానెళ్లన్నీ డిజిటల్ రైట్స్ తో కలుపుకొని శాటిలైట్ హక్కులు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. బోయపాటి-బాలయ్య సినిమాకు సంబంధించి ఓ ఓటీటీ సంస్థతో ఆల్రెడీ డిజిటల్ రైట్స్ ఓ కొలిక్కి వచ్చేశాయి. అందుకే శాటిలైట్ డీల్ క్లోజ్ అవ్వడానికి టైమ్ పడుతోంది.

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

ఆ జోష్ వైసీపీకి ఇప్పట్లో వస్తుందా?