జగన్ శాశ్వతంగా ఫినిష్ అంటే అర్థమేంటి బాబూ?

ప్రత్యర్థిని రాజకీయంగా ఢీకొట్టలేనప్పుడు, ఓటమిని అంగీకరించలేనప్పుడు, అయితే వెన్నుపోటు పొడిచేయడం లేకపోతే స్పాటు పెట్టేయాలనుకోవడం…బాబు తీరు ఇదేలా ఉంది. Advertisement మనసులో ఉన్నమాటని ఎప్పుడో అప్పుడు ఆవేశంలో పెదవులు పలక్కుండా ఉండవు. “ముఖ్యమంత్రి గాల్లోనే…

ప్రత్యర్థిని రాజకీయంగా ఢీకొట్టలేనప్పుడు, ఓటమిని అంగీకరించలేనప్పుడు, అయితే వెన్నుపోటు పొడిచేయడం లేకపోతే స్పాటు పెట్టేయాలనుకోవడం…బాబు తీరు ఇదేలా ఉంది.

మనసులో ఉన్నమాటని ఎప్పుడో అప్పుడు ఆవేశంలో పెదవులు పలక్కుండా ఉండవు.

“ముఖ్యమంత్రి గాల్లోనే వస్తాడు.. గాల్లోనే పోతాడు.. గిరగిరా తిరుగుతున్నాడు. ఎక్కడో ఓ చోట శాశ్వతంగా ఫినిష్‌ అవుతాడు. మనతో పెట్టుకున్నోడు కాలగర్భంలో కలిసిపోయాడు” అని వరదబాధుతుల్ని పరామర్శించే నెపంతో చిత్తూరెళ్లిన చంద్రబాబు మైకులో అనేసాడు.

“మనతో పెట్టుకున్నోడు కాలగర్భంలో కలిసిపోయాడు…” అంటే ఏంటి?

వైయస్సార్ మరణం వెనుక తన హస్తం ఉందంటున్నాడా చంద్రబాబు? లేక తాను దైవాంశ సంభూతుడిని కాబట్టి తన మీద ఎవరు రాజకీయంగా గెలిచినా ప్రకృతి పగబట్టి చంపేస్తుందని చెబుతున్నాడా?

“ఇదిగో మాధవరెడ్డి అంటే అడిగో లోకేష్” అనే దుస్థితి ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి మాటలంటే వైయస్సార్ మరణానికి చంద్రబాబుకి లింకుందని సోషల్ మీడియా కథకులు కథలల్లరూ? ఎందుకొచ్చిన శాపనార్థాలు? హెచ్చరికలు?

వరదబాధితుల పరామర్శకి వెళ్లినవాడు రాజకీయ ప్రసంగాలు చేయడమెందుకు? ప్రజలేమైనా మెచ్చుకుంటారా? నిన్నగాక మొన్న గుక్కపెట్టి ఏడ్చి ఇవాళ వార్ణింగులిస్తుంటే, ఏడ్చి మొహం కడుక్కున్నట్టు ఉంటుంది కానీ జనం ఈలలేసేలా ఉంటుందా? ఈ మాత్రం తూకం కూడా తెలియడంలేదా బాబుకు?

రాను రాను తండ్రి కూడా కొడుకులాగానే తయారవుతున్నాడు. ఎక్కడికెళ్లినా ప్రభుత్వాన్ని, జగన్ ని తిట్టిపోయడం తప్ప జనం మనసు గెలుచుకునే పని ఒక్కటి కూడా చెయ్యకపోవడం ఆశ్చర్యం.

ప్రభుత్వం ఒక్కో వరదబాధిత కుటుంబానికి కోటిరూపాయలిమ్మనడం, రైతులకి ముప్పైవేలిమ్మనడం…ఇలా ఒకటి కాదు అందరికీ అన్నీ ఇమ్మని ఆర్డర్లేస్తున్నాడు బాబు. మళ్లీ నవరత్నాల స్కీములు చూసి “రాష్ట్రానికి ఆదాయం లేదు కానీ ముఖ్యమంత్రి అందరికీ అన్నీ పంచేస్తున్నాడు” అని గగ్గోలు పెడతాడు.

ఇస్తే ఏడ్చేదీ నువ్వే..మళ్లీ ఇమ్మనేదీ నువ్వే.

ఏంటి బాబూ ఇది? నిన్నెలా అర్థం చేసుకోవాలి?

నువ్వు ఇవ్వవు, ఎదుటి వాడు ఇస్తుంటే సరిపోదంటావు. ఏవిటో అర్థం కావు.

ఆ ఆర్డర్లు సరే. తెదేపా నిధిలోనుంచి ఎంతో కొంత వరదబాధితులకి ఇవ్వకపోయావా? స్వయంగా బాధితుల్ని కలుసుకున్నప్పుడు ఆ పని చేయొచ్చు కదా? చెయ్యవు..ఎందుకంటే ఎన్నికలకి చాలా దూరం ఉంది.

అయినా 2019లో సరిగ్గా ఎన్నికల ముందు పసుపుకుంకాలని డబ్బిస్తే ఓటర్లంతా తన పదవికున్న పసుపుకుంకాలు చెరిపేసారు. అందుకే డబ్బివ్వాలా, వద్దా అనేది కూడా సంశయమే బాబుకి.

బాబూ! ముఖ్యమంత్రి చావుని కోరుకునేంత స్థాయిలో నీకు మండిపోతోందంటే నీకు పదవీకాంక్ష ఎంతెలా ఉందో తెలుస్తూనే ఉంది. దానికోసం ఎంతకైనా తెగిస్తావేమో అని కూడా అనిపిస్తోంది. నువ్వు, నీ కొడుకు తప్ప రాష్ట్రాన్ని ఎవరు పాలించినా నీ దృష్టిలో అరాచకమే.

బాబూ! ఆల్రెడీ నీ ఏడుపుకి కారణమైన కొడాలి, అంబటి, వల్లభనేని లకి ప్రాణభయం ఉందని తెలిసి ప్రభుత్వం సెక్యూరిటీ పెంచింది. జగన్ మోహన్ రెడ్డి కూడా పెంచుకోవాలేమో. అందరికంటే సేఫ్ పొజిషన్లో ఉన్నది మాత్రం నువ్వే. ఎందుకంటే నీకంటే పెద్ద సెక్యూరిటీ ఎవ్వరికీ లేదిక్కడ. అంతా జెడ్ ప్లస్ కదా!

హరగోపల్ సూరపనేని