ఎన్టీఆర్ పై ‘దేశం’ ధ్వజం

తెలుగుదేశం పార్టీ తరపున తరచు మీడియా ముందుకు వచ్చే నేత ఆరోపణలు, విమర్శలు చేసారంటే అవి వ్యక్తిగతమైనవిగా అనుకోవడానికి లేదు. మాజీ సిఎమ్ చంద్రబాబు సతీమణి భువన్వేశ్వరిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో జరిగిన గందరగోళం…

తెలుగుదేశం పార్టీ తరపున తరచు మీడియా ముందుకు వచ్చే నేత ఆరోపణలు, విమర్శలు చేసారంటే అవి వ్యక్తిగతమైనవిగా అనుకోవడానికి లేదు. మాజీ సిఎమ్ చంద్రబాబు సతీమణి భువన్వేశ్వరిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో జరిగిన గందరగోళం సంగతి తెలిసిందే. దీని మీద నందమూరి కుటుంబం అంతా స్పందించింది. విదేశాల్లో వున్న ఎన్టీఆర్ కూడా స్పందించారు.

అయితే ఆ స్పందన సరిగ్గా లేదంటున్నారు తెలుగుదేశం నేత వర్లరామయ్య. ఈ ఉదంతంలో కీలకమైన నేతలు ఇద్దరు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ ఎన్టీఆర్ కు సన్నిహితులు కావడం విశేషం. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని వర్ల రామయ్య విమర్శించారు.

మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. . సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య నిలదీశారు.

వల్లభనేని వంశీ విషయంలో ఎన్టీయార్ మొదట్లోనే ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదని వర్ల అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవాళ్లే టీడీపీ సభ్యులని వర్ల స్పష్టం చేశారు.

అయితే అంతా బాగానే వుంది. అనేవి అన్నీ అనేసి  జూనియర్ ఎన్టీయార్‌పై తాను చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని వర్ల రామయ్య ప్రకటించారు. ఇదెక్కడి చోద్యం. ఎవరో అన్న కామెంట్లకు ఎన్టీఆర్ స్పందించాలా?  వర్ల రామయ్య కామెంట్లతో మాత్రం ఎవరికీ సంబంధం లేదా? అదేంటో?