థియేటర్ మేనేజ్ మెంట్లు ఫుల్ హ్యాపీ

టికెట్ రేట్లు పెరగకపోవచ్చు అని ఓ క్లారిటీ వచ్చింది. జగన్ మనసులో ఏమైనా అద్భుతం జరిగితే తప్ప పెద్ద సినిమాలకు అదనపు రేట్లు ఇవ్వకపోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో అఖండ కు 9 కోట్లు, పుష్పకు…

టికెట్ రేట్లు పెరగకపోవచ్చు అని ఓ క్లారిటీ వచ్చింది. జగన్ మనసులో ఏమైనా అద్భుతం జరిగితే తప్ప పెద్ద సినిమాలకు అదనపు రేట్లు ఇవ్వకపోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో అఖండ కు 9 కోట్లు, పుష్పకు 16 కోట్లు, ఆర్ఆర్ఆర్ కు 30 కోట్ల వరకు లాభాల్లో కోత పడిపోతుంది. ఎందుకంటే 20 శాతం తగ్గించకుండా బయ్యర్లు డబ్బులు కట్టడం అసాధ్యం. 

కానీ ఇదిలా వుంటే థియేటర్లను మేనేజ్ చేసే వారికి మాత్రం సంక్రాంతి పండగ నిజంగా పండగగా మారుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. థియేటర్లు లీజుకు తీసుకున్నవారే మేనేజ్ చేస్తారో, లేదా థియేటర్ ఒరిజినల్ మేనేజ్ మెంట్ల చేతే మేనేజ్ చేయిస్తారో. పండగ టైమ్ లో కావచ్చు, పెద్ద సినిమాల విడుదల టైమ్ లో కావచ్చు. ఫుల్ గా మళ్లీ బ్లాక్ టికెట్ వ్యవహారం ప్రారంభం అవుతుంది. 

ఒక్కో ఆటకు కనీసంలో కనీసం యాభై వేల వంతున వెనక్కు లాగొచ్చు అని లెక్కలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి సినిమాల టికెట్ల రేట్లు తొలి రోజు అయిదు వందలు అయినా కొంటారు అభిమానులు. అలాగే లోకల్ అధారిటీలను మేనేజ్ చేసి పాత రేట్లే  విక్రయించడం పక్కా. ఎందుకుంటే ఇప్పటి వరకు గత రెండు నెలలుగా జరుగుతున్నది అదే. ప్రభుత్వం వైపు నుంచి కొత్త జివో అమలు చేయాలని వత్తిడి ఏమీ లేదు. అందువల్ల ఇది కూడా అదనపు ఆదాయమే.

కానీ ఈ ఆదాయాలు ఏవీ డిస్ట్రిబ్యూటర్లకు అందుతాయా? లేదా? అందేలా చేయడానికి మార్గాలు ఏమన్నా వున్నాయా? అన్నది తెలియాల్సి వుంది. డిస్టిబ్యూటర్ల చేతుల్లో వున్న థియేటర్ల వరకు ఫరవాలేదు. వాళ్ల స్వంత సిబ్బందితో నిర్వహిస్తారు కాబట్టి, ఈ అదనపు బ్లాక్ ఆదాయం వారికే చేరుతుంది.

కానీ ఇవేవీ నికరం కాదు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు 20శాతం తగ్గించాల్సిందే అని పట్టుపడుతున్నారు. ఇలా చేస్తే డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కుతారు. తక్కువ రేట్లు, తక్కువ టికెట్ రేట్లు బ్యాలన్స్ అవుతాయి. అవకాశం, పండగ వాతావరణం, సినిమాలు హిట్ కావడం బట్టి వెనుక నుంచి అదనుపు ఆదాయం వచ్చే అవకాశం వుంటుంది.