పాపం బాబు: మొన్న అమరావతి, ఈసారి కర్నూలు

అమరావతి పర్యటన సందర్భంగా చంద్రబాబుకు ఎదురైన పరాభవం గురించి అందరికీ తెలిసిందే. రాజధాని ప్రాంతాన్ని నాశనం చేశారని, రైతుల నోట్లో మట్టికొట్టారని ఆరోపిస్తూ తీవ్ర వ్యతిరేక ఎదుర్కొన్నారు బాబు. అతడి కాన్వాయ్ పైకి కర్రలు,…

అమరావతి పర్యటన సందర్భంగా చంద్రబాబుకు ఎదురైన పరాభవం గురించి అందరికీ తెలిసిందే. రాజధాని ప్రాంతాన్ని నాశనం చేశారని, రైతుల నోట్లో మట్టికొట్టారని ఆరోపిస్తూ తీవ్ర వ్యతిరేక ఎదుర్కొన్నారు బాబు. అతడి కాన్వాయ్ పైకి కర్రలు, చెప్పులు విసిరారు. నిజానికి అప్పటి ఆ వ్యతిరేతను చంద్రబాబు ఊహించలేదు. కాబట్టి అక్కడికి వెళ్లారని అనుకోవచ్చు.

అయితే అమరావతి అనుభవాల్ని చవిచూసి మరీ చంద్రబాబు ఇప్పుడు మరో టూర్ పెట్టుకున్నారు. ఈసారి ఆయన కర్నూల్ పర్యటనకు రెడీ అవుతున్నారు. రేపట్నుంచి 3 రోజుల పాటు కర్నూలులో పర్యటించబోతున్నారు చంద్రబాబు.

వివిధ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా మరోసారి బాబుకు నిరసన సెగ తగలడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కర్నూలుకు చంద్రబాబు చేసిన అన్యాయం గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్నూలు పేరును విచ్చలవిడిగా వాడుకున్నారు.

ఎన్నికల ప్రచారం టైమ్ లో అయితే ఏకంగా కర్నూలునే రాజధానిగా చేస్తానన్నారు. విజయవాడ నుంచి కర్నూలుకు 6 వరసల ఎక్స్ ప్రెస్ హైవే ఏర్పాటుచేస్తామన్నారు.

ఆ తర్వాత రాజధానిగా అమరావతిని ఫిక్స్ చేసుకున్నారు. భూపందేరం షురూ చేశారు. ఆ టైమ్ లో కూడా కర్నూలును వాడుకోవడం ఆపలేదు బాబు. హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేస్తామన్నట్టు ఫీలర్లు వదిలారు.

తర్వాత అది కూడా లేకుండా చేశారు. ఇలా అధికారంలో ఉన్న ఐదేళ్లు కర్నూలుకు, రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసిన బాబును, తమ గడ్డపై అడుగుపెట్టనివ్వమని అంటున్నారు పలు విద్యార్థి నాయకులు. ఈ మేరకు రాయలసీమ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ అల్టిమేటం ఇచ్చింది.

ఊహించని విధంగా అమరావతిలో నిరసన ఎదుర్కొన్న చంద్రబాబు, ఈసారి హెచ్చరికలతోనే తన పర్యటనను ప్రారంభిస్తున్నారు. ఈసారి బాబుకు ఎన్ని నిరసనలు ఎదురవుతాయో చూడాలి.