జనం ఏది చూస్తే ఆ మాధ్యమంలోనే ప్రచారం చేయడం అన్నది కామన్. లేటెస్ట్ గా టిక్ టాక్ అన్నది పాపులర్ అయిన మాధ్యమం. పల్లెటూర్ల నుంచి పట్నాల దాకా అందరూ ఫాలో అవుతున్న మాధ్యమం.
అందుకే సినిమా జనాలు ఇప్పుడు టిక్ టాక్ వెనుక పడ్డారు. పెద్ద సినిమాలు, క్రేజీ డైలాగులు సాంగ్స్ అయితే టిక్ టాక్ జనాలే స్వయంగా చేస్తారు. మరి చిన్న మీడియం సినిమా సంగతేమిటి? అందుకే రివర్స్ లో డబ్బులు ఖర్చు పెట్టి మరీ టిక్ టాక్ చేయిుస్తున్నారు.
మారుతి ప్రతి రోజూ పండగే సినిమాలో ఓ బావా అనే పాటను పాపులర్ చేయడం కోసం యాభై వేలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. టిక్ టాక్ బాగా చేసే అమ్మాయిల నెంబర్లు సంపాదించి, వాళ్లకు ఫోన్లు చేసి టిక్ టాక్ చేయమని కోరి, ఒక్కో టిక్ టాక్ కు వెయ్యి రూపాయల వంతున ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది.
హీరో నిఖిల్ మరో అడుగు ముందుకు వేసి టిక్ టాక్ చేసే వాళ్లను హైదరాబాద్ కు రప్పించి, తాను కూడా వాళ్లతో కలిసి టిక్ టాక్ లు చేసి వదిలారు. దీని కోసం కొంత ఖర్చును భరించారు.
ఇక హీరో కార్తికేయ కూడా ఇదే రూట్ లో కొంత మందితో టిక్ టాక్ లు చేసారు. చూస్తూ వుంటే ఇక ప్రతి సినిమాకు హీరోలు టిక్ టాక్ ప్రమోషన్ కు కూడా కొంత సమయం కేటాయించాల్సి వచ్చేలా వుంది.