ప్రియాంక రెడ్డి హత్యకేసుకు సంబంధించి మరో బాధాకర వాస్తవం వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన తర్వాత, ప్రియాంక రెడ్డి చనిపోయిందని భావించారట ఆ దుర్మార్గులు. దీంతో అక్కడే వదిలేసి పారిపోవాలని అనుకున్నారు.
అయితే అదే సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంక రెడ్డి, కళ్లు తెరవడంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. కళ్లు తెరిచి చూసిందని ఆమెను చంపేశారు.
ఆ తర్వాత మృతదేహాన్ని లారీ క్యాబిన్ లోకి ఎక్కించి, అక్కడ కూడా మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడ్నుంచి చటాన్ పల్లి ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లి, మృతదేహాన్ని కాల్చేశారు.
ఈ విషయం బయటకొచ్చిన తర్వాత ప్రియాంక తల్లిదండ్రుల బాధకు అంతులేకుండా పోయింది. రాత్రి నుంచి వాళ్లు విలపిస్తూనే ఉన్నారు. ఆ కాలనీ మొత్తం విషాదం అలముకుంది.
ప్రస్తుతం ప్రియాంకరెడ్డి తల్లిదండ్రులు నివశిస్తున్న కాలనీ వాసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాలనీ ఎంట్రన్స్ లో ఉన్న గేట్ ను మూసేశారు. పోలీసులు, రాజకీయ నాయకులు ఎవ్వరూ ప్రియాంక ఇంటికి రావొద్దని వాళ్లు చెబుతున్నారు.
నిందితులు ఎవరో తెలిసింది కాబట్టి, వాళ్లకు శిక్షలు ఖరారు చేసిన తర్వాత మాత్రమే ప్రియంక తల్లిదండ్రుల్ని కలవాలని వాళ్లు కండిషన్ పెట్టారు. ఈలోగా ఎలాంటి పరామర్శలు అక్కర్లేదని కరాఖండిగా చెబుతున్నారు.
అటు ప్రధాన నిందితుడు ఆరిఫ్ కు సంబంధించిన నేర చరిత్ర మొత్తం బయటపడుతోంది. ప్రియాంక రెడ్డి హత్య కంటే ముందు అతడు దొంగతనం చేశాడు. అంతకంటే ముందు రవాణా అధికారుల కళ్లుగప్పి లారీని తీసుకుపోయారు. ఇవన్నీ ఒకెత్తయితే, అతడికి అసలు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు.
రాయ్ చూర్ కు ఐరెన్ రాడ్స్ లోడ్ తీసుకెళ్లాడు ఆరిఫ్. ఆ లోడ్ నుంచి 2 రాడ్స్ ను దొంగిలించాడు. వాటిని ఓ ప్రదేశంలో దాచి, లోడ్ డెలివరీ చేశాడు. తిరిగొస్తూ.. మిగతా ముగ్గుర్ని కూడా తన లారీలో ఎక్కించుకొని.. ఇనుప కడ్డీలున్న ప్రాంతానికి వచ్చారు.
ఆ కడ్డీల్ని అమ్మగా వాళ్లకు 4వేల రూపాయలు వచ్చాయి. వాటితోనే మద్యం కొన్నారు. అదే టైమ్ లో ప్రియాంక రెడ్డి తన స్కూటర్ పార్క్ చేయడాన్ని గమనించారు. కచ్చితంగా ఆమె తిరిగి వస్తుంది కాబట్టి, అత్యాచారం చేద్దామని పన్నాగం పన్నారు.