ఇంకా నయం..తమ్ముళ్లు చంద్రబాబు మీద దాడి చేయలేదు!

‘ఇంకా నయం చంద్రబాబును కొట్టలేదు..’ అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే! తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. Advertisement ఎన్నికల తర్వాత చంద్రబాబు…

‘ఇంకా నయం చంద్రబాబును కొట్టలేదు..’ అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే! తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీకి రిపేర్లు అంటూ ఈ పర్యటనలు పెట్టుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కడపకే వెళ్లడం వెనుక ఒక వ్యూహం ఉందని అంటున్నారు పరిశీలకులు.

రెచ్చగొట్టడమే ఆ వ్యూహం. చంద్రబాబు నాయుడు తన పార్టీని సరిదిద్దుకోవాలనుకుంటే..ముందుగా వెళ్లాల్సింది కడపకు కాదు. అనంతపురం వంటి జిల్లాకు వెళ్లి చంద్రబాబు నాయుడు తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సింది.

ఎందుకంటే.. ఇటీవలి ఎన్నికల ముందు వరకూ అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేది. అయితే ఎన్నికల్లో ఆ పార్టీకి అక్కడ భారీ ఝలక్ తగిలింది. పన్నెండు సీట్ల నుంచి రెండు సీట్ల స్థాయికి పడిపోయింది టీడీపీ.

అలాంటి చోట పునరుద్ధరణ చర్యటు  చేపడితే చంద్రబాబు నాయుడుకు ఏదో పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు కావాల్సింది పార్టీ కాదు. పేచీ. ఏదోలా పేచీలు పెట్టుకోవడం చంద్రబాబుకు కావాలి. అందుకే ఆయన సరాసరి కడపకు వెళ్లి రచ్చ రాజేసే ప్రయత్నం చేశారు.

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండింది ఏమీ లేదు. చంద్రబాబు హయాం వచ్చాకా కడపలో తెలుగుదేశం పార్టీ పొడించింది లేదు. ఒక్క అసెంబ్లీ సీటు లేకపోతే అది కూడా లేదు అన్నట్టుగానే సాగింది వ్యవహారం. అలాంటి చోటకు చంద్రబాబు నాయుడు వెళ్లి ఏం రిపేర్ చేద్దామనుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

అయితే చంద్రబాబు నాయుడు ఏదోలా రచ్చ రేపడానికి కడపకు వెళ్లారని స్పష్టం అవుతోంది. కానీ అక్కడ రివర్స్ లో చిచ్చు రాజుకుంది. చంద్రబాబు నాయుడు ఎదుటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. రెండు  వర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. చితకొట్టేసుకున్నారు. చంద్రబాబు నాయుడు  వారిని వారించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.

అధినేత ఎదుటే తమ్ముళ్లు కుమ్మేసుకుని తమ క్రమశిక్షణ ఏ స్థాయిదో, చంద్రబాబుకు తామిచ్చే గౌరవం ఏ పాటిదో చాటి చెప్పుకున్నారు. చంద్రబాబు ఎదుట కుమ్మేసుకున్న తమ్ముళ్లు.. అనంతరం వెళ్లి వేర్వేరుగా కేసులు పెట్టుకున్నారట. మరి ఆ కేసుల విచారణకు చంద్రబాబు ను పోలీసులు సాక్షిగా పిలుస్తారేమో!

ఆ సంగతలా ఉంటే.. కడప జిల్లా సమీక్షా సమావేశంలో తమ్ముళ్ల గోల చూశాకా.. ‘ఇంకా నయం వాళ్లు తిరగబడి చంద్రబాబు మీద దాడి చేయలేదు, పార్టీ ఓడిపోయిందన ఫ్రష్ట్రేషన్లో దానికి కారణం చంద్రబాబు అంటూ.. వారు ఆయన మీద విరుచుకుపడలేదు.. సుమా..’ అంటూ కొంతమంది తెలుగుదేశం అభిమానులు వ్యాఖ్యానిస్తూ గొణుగుతున్నారని భోగట్టా!