వెబ్ సిరీస్ చేస్తా.. కానీ ఎవ్వరూ అడగడం లేదు

తనకు ఓటీటీల్లో నటించాలని ఉందని, కానీ ఇంతవరకు ఎవ్వరూ తనను సంప్రదించలేదంటున్నాడు హీరో రాజ్ తరుణ్. సినిమాల్లో చేయలేని ప్రయోగాల్ని వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ లో చేయొచ్చని చెబుతున్నాడు. Advertisement “వెబ్ సిరీస్,…

తనకు ఓటీటీల్లో నటించాలని ఉందని, కానీ ఇంతవరకు ఎవ్వరూ తనను సంప్రదించలేదంటున్నాడు హీరో రాజ్ తరుణ్. సినిమాల్లో చేయలేని ప్రయోగాల్ని వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ లో చేయొచ్చని చెబుతున్నాడు.

“వెబ్ సిరీస్, ఓటీటీ ఒరిజినల్ మూవీస్ కోసం నన్ను ఎవ్వరూ సంప్రదించలేదు. నేను చేయడానికి రెడీగా ఉన్నాను కానీ నన్ను ఎవరూ అడగలేదు. ఓటీటీలో మంచి ప్రయోగాలు చేయొచ్చు. సినిమాల్లో చేయలేని ప్రయోగాల్ని ఓటీటీల్లో చేయొచ్చు. నాకు ప్రయోగాలు చేయడం ఇష్టం. ఓటీటీల్లో నటించాలని ఉంది. ఏదైనా కుదిరితే తప్పకుండా చేస్తా.”

ఓటీటీల్లో నటించడంతో పాటు ఎవరైనా అవకాశం ఇస్తే సినిమాల్లో విలన్ పాత్రలు కూడా నటిస్తానంటున్నాడు రాజ్ తరుణ్. అయితే 10 మందిని కొట్టేసే లాంటి పాత్ర కాకుండా నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయాలని ఉందంటున్నాడు.

“నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలని ఎప్పట్నుంచో ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. అలా అని కొడితే ఓ 10 మంది అలా గాల్లో ఎగిరిపోయేలాంటి విలనిజం నచ్చదు. అది నేను చేసినా కూడా ఎవ్వరూ ఇష్టపడరు. యాక్షన్ లో కాదు, పాత్రలో నెగెటివ్ టచ్ ఉండాలి. అలాంటి పాత్ర దొరికితే మల్టీస్టారర్ మూవీ అయినా చేస్తాను.”

రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా అక్టోబర్ 2న ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ.. ఇలా ఓటీటీలపై, విలన్ పాత్రలపై తన అభిప్రాయాల్ని బయటపెట్టాడు ఈ హీరో.