మరో క్రేజీ ప్రాజెక్టు ప్రకటించిన సూపర్ స్టార్

కోలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. జైలర్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన రజనీకాంత్, త్వరలోనే సూపర్ హిట్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని…

కోలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. జైలర్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన రజనీకాంత్, త్వరలోనే సూపర్ హిట్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఖైదీ సినిమాతో టోటల్ సౌత్ ను ఎట్రాక్ట్ చేసిన ఈ దర్శకుడు, విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా లియో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే రజనీకాంత్ తో సినిమా స్టార్ట్ అవుతుంది.

దర్శకుడు మినహా, దాదాపు జైలర్ యూనిట్ అంతా ఈ సినిమాకు రిపీట్ అవుతుంది. సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను మరోసారి తీసుకున్నారు. హీరోయిన్ గా తమన్న పేరును కూడా పరిశీలిస్తున్నారు. ఇక యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గా అన్బు అరివును తీసుకున్నారు.

రజనీకాంత్-లోకేష్ కాంబినేషన్ లో సినిమాపై చాన్నాళ్లుగా కోలీవుడ్ లో చర్చ జరుగుతోంది. వీళ్లిద్దరూ కలిస్తే రికార్డులు బద్దలవుతాయనే అంచనాలున్నాయి. సరిగ్గా జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన వేళ.. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంతో తళైవ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఈ సినిమా కంటే ముందు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా పూర్తిచేసిన తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా ఉంటుందా లేక జ్ఞానవేల్ సినిమాను పక్కనపెట్టి, లోకేష్ ప్రాజెక్ట్ నే ముందుగా సెట్స్ పైకి తీసుకొస్తారా అనేది చూడాలి.