ప్రియాంక రెడ్డి మర్డర్: ఏ టైమ్ లో ఏం జరిగింది?

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డిను పథకం ప్రకారం హత్య చేశారని తేలిపోయింది. కామంతో కళ్లు మూసుకుపోయి మద్యం మత్తులో హంతకులు ఈ ఘోరానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. Advertisement ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్రియాంక కదలికలను…

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డిను పథకం ప్రకారం హత్య చేశారని తేలిపోయింది. కామంతో కళ్లు మూసుకుపోయి మద్యం మత్తులో హంతకులు ఈ ఘోరానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్రియాంక కదలికలను పసిగట్టి నలుగురు దుండగులు అప్పటికప్పుడు 40 నిమిషాల వ్యవధిలోనే పథకం పన్ని ఆమెను కిరాతంగా హత్య చేశారు.

ప్రియాంకకు సహాయం చేస్తున్నట్టు నటించి ఆమెను నమ్మించి ఈ అఘాయ్యితానికి పాల్పడ్డారు. అమాయకంగా వారిని నమ్మిన ప్రియాంక చివరకు తన ప్రాణాలు పోగొట్టుకుంది.

సాయంత్రం 5.50 – తన ఇంటి నుంచి ప్రియాంక రెడ్డి బయల్దేరింది

6.08 – తొండుపల్లి టోల్ ప్లాజాకు చేరుకుంది. బండి పార్క్ చేయడానికి ప్రయత్నిస్తే, నిరాకరించిన సిబ్బంది
6.18 – టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసింది
9.13 – గచ్చిబౌలి నుంచి తిరిగి టోల్ ప్లాజాకు వచ్చింది. బైక్ పంక్చర్ అయింది
9.19 – చెల్లెలికి ఫోన్ చేసింది.. బైక్ పంక్చర్ అయిందని చెప్పిన ప్రియాంకరెడ్డి
9.23 – నిందితుడు శివ, ప్రియాంక దగ్గరకొచ్చాడు. బైక్ పంక్చర్ వేయిస్తానని నమ్మించాడు
9.30 – షాప్స్ మూసేశారని చెప్పి, మళ్లీ బండి తీసుకెళ్లాడు
9.35 – బైక్ లో గాలికొట్టించి తిరిగి స్పాట్ కు చేరుకున్నాడు
9.48 – ప్రియాంక ఫోన్ స్విచాఫ్ అయింది
10.08 – నలుగురు దుర్మార్గులు ప్రియాంకను అత్యాచారం చేశారు, అదే క్రమంలో ఆమె హత్యకు కూడా గురైంది.
10.28 – మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి లారీ ఎక్కించిన దుర్మార్గులు
10.33 – ముందు స్కూటీ, వెనక లారీ బయల్దేరింది

అలా అర్థరాత్రి వరకు ప్రయాణించిన తర్వాత ఓ పెట్రోల్ బంక్ వద్ద బాటిల్ లో పెట్రోల్ కొనడానికి వీళ్లు ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో మరో బంక్ దగ్గర ట్రైచేశారు. ఈసారి పెట్రోల దొరికింది. దీంతో షాద్ నగర్ సమీపంలో మృతదేహాన్ని తగలబెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు.

ఘాతుకానికి పాల్పడ్డ దుర్మార్గుల్ని గంటల వ్యవధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లను మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులుగా గుర్తించారు. ఈ కేసును మహబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించారు.