Advertisement

Advertisement


Home > Movies - Movie News

నీ ఏజ్ ఏంది... ఆ గేజ్ ఏంది!

నీ ఏజ్ ఏంది... ఆ గేజ్ ఏంది!

"ఇదిగో బాలయ్య కొడుకు.. అదిగో హీరోగా వచ్చేస్తున్నాడు. గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాడు. హీరోగా మేకోవర్ అవుతున్నాడు. కొడుకు డెబ్యూ కోసం బాలయ్య మంచి ముహూర్తం చూస్తున్నాడు. కథ కూడా ఎప్పుడో లాక్ అయింది. "

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ఇలా మినిమం గ్యాప్స్ లో ఎన్నో కథనాలు వచ్చాయి. అతడి ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ కూడా చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే అలా ఎదురుచూసే వాళ్లందరి భ్రమల్ని పటాపంచలు చేశాడు మోక్షజ్ఞ.

ఒక్క ఫొటో.. ఒకే ఒక్క ఫొటోతో మోక్షజ్ఞ పరిస్థితేంటనేది తేలిపోయింది. తనకు ఇప్పట్లో తెరపైకి వచ్చే ఉద్దేశం లేదని ఆ ఒక్క పిక్ తో తనకు తెలియకుండానే క్లారిటీ ఇచ్చేశాడు మోక్షజ్ఞ. రూలర్ షూటింగ్ సమయంలో ఇలా ఫ్యామిలీ ఫొటో దిగారంతా. ఆ ఫొటోలో కంప్లీట్ షేప్-అవుట్ లో కనిపించాడు మోక్షజ్ఞ.

ఆ వయసులో ఆ పొట్ట, ఆ ఫిజిక్ చూసి ఒక్క క్షణం అంతా అవాక్కయ్యారు. అసలు ఇతడు మోక్షజ్ఞ కాదేమో అనే అనుమానంతో కళ్లు పెద్దవి చేసుకొని ఒకటికి రెండుసార్లు పరీక్షగా చూసిన జనాలు కూడా ఉన్నారు. అలా మోక్షజ్ఞను చూసినవాళ్లంతా ఆ తర్వాత అవాక్కయ్యారు. హీరోగా మారేందుకు ప్రయత్నిస్తున్న మోక్షజ్ఞ ఇతడేనా అనే అనుమానాలు వ్యక్తంచేశారు.

ఈ ఒక్క ఫొటోతో నందమూరి అభిమానుల నోళ్లు మూతపడ్డాయి. మరోవైపు మిగతా హీరోల ఫ్యాన్స్ మాత్రం ఈ ఫొటోను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. బాలయ్య కొడుకు కంటే అల్లుడే హీరోలా ఉన్నాడని కొందరు అంటుంటే.. తాత, తండ్రి వారసత్వాన్ని (పొట్ట విషయంలో) కొడుకు కొనసాగిస్తున్నాడని మరికొందరు సెటైర్లు వేశారు. మొత్తమ్మీద మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టే అనే విషయం మాత్రం స్పష్టమైంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?