కొరటాల శివ ఇరుక్కుపోయాడు

హండ్రెడ్‌ పర్సంట్‌ సక్సెస్‌ రేట్‌తో రాజమౌళి తర్వాత తెలుగు సినిమాకి అంతటి కమర్షియల్‌ దర్శకుడని అనిపించుకున్న కొరటాల శివ చాలా రోజులుగా మెగా కాంపౌండ్‌లోనే వుండిపోయాడు. Advertisement భరత్‌ అనే నేను తర్వాత ఒక…

హండ్రెడ్‌ పర్సంట్‌ సక్సెస్‌ రేట్‌తో రాజమౌళి తర్వాత తెలుగు సినిమాకి అంతటి కమర్షియల్‌ దర్శకుడని అనిపించుకున్న కొరటాల శివ చాలా రోజులుగా మెగా కాంపౌండ్‌లోనే వుండిపోయాడు.

భరత్‌ అనే నేను తర్వాత ఒక ఠాగూర్‌ లాంటి సినిమా చేద్దామంటూ చిరంజీవిని అప్రోచ్‌ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్‌లో సినిమా మొదలు పెడతామంటూ అతడిని ఆపేసి అలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఏడాది గడిపేసారు.

ఇప్పటికీ చిరంజీవి తొందర పడుతున్నట్టు కానీ, త్వరగా ఈ చిత్రం పూర్తి చేద్దామన్నట్టు గానీ కనిపించడం లేదు. అరవై నాలుగేళ్ల వయసులో చిరంజీవిలో మునుపటి చురుకు ఆశించడం అత్యాశే కానీ మరీ ఇలా ఒక స్టార్‌ దర్శకుడి సమయం వృధా చేయడం పట్ల సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది.

సైరా పూర్తయిన తర్వాత కూడా చిరంజీవి ఈ చిత్రం కోసం తొందర పడకపోవడం, ఇంకా షూటింగ్‌ మొదలు పెట్టకపోవడం అభిమానులని కూడా అసహనానికి గురి చేస్తోంది.

వీలయినంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేయాలని కొరటాల శివ చూస్తున్నా కానీ చిరంజీవికి ఆ తొందర వున్నట్టు అనిపించడం లేదు.

వేసవిలో భారీ చిత్రాలు లేవు కనుక ఆ సమయంలో విడుదలయ్యేలా ప్లాన్‌ చేసుకున్నట్టయితే ఈ భారీ చిత్రానికి చాలా ప్లస్‌ అవుతుంది. కానీ ఇంతవరకు మొదలే కాలేదు కనుక ఈ చిత్రం ఆగస్టులో వస్తే గొప్పే అనుకోవాలి.