పవన్‌కళ్యాణ్‌కి హీరోలున్నారు.. దర్శకులేరీ?

పవన్‌కళ్యాణ్‌ తిరిగి నటిస్తాడా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు కానీ త్వరలోనే సినీ నిర్మాణం అయితే పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాడని సమాచారం. Advertisement త్రివిక్రమ్‌తో కలిసి అప్పట్లోనే జాయింట్‌ ప్రొడక్షన్‌ అనుకున్నాడు కానీ…

పవన్‌కళ్యాణ్‌ తిరిగి నటిస్తాడా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు కానీ త్వరలోనే సినీ నిర్మాణం అయితే పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాడని సమాచారం.

త్రివిక్రమ్‌తో కలిసి అప్పట్లోనే జాయింట్‌ ప్రొడక్షన్‌ అనుకున్నాడు కానీ అది మెటీరియలైజ్‌ అవలేదు. ఇటీవల రామ్‌ చరణ్‌ దగ్గర కూడా ఈ ప్రపోజల్‌ పెట్టినట్టు సమాచారం. త్రివిక్రమ్‌తో ఇంతవరకు చరణ్‌ ఒక్క సినిమా కూడా చేయలేదు కనుక ఈ కాంబినేషన్‌లో సినిమా నిర్మించాలని పవన్‌ భావిస్తున్నాడట.

మెగా ఫ్యామిలీ నుంచే చాలా మంది హీరోలున్నారు కనుక నిర్మాతగా పవన్‌ చేసే చిత్రాలకి హీరోలు దొరకడం కష్టం కాదు. కానీ దర్శకులుగా మాత్రం త్రివిక్రమ్‌, హరీష్‌ శంకర్‌ లాంటి కొందరికి తప్ప పవన్‌ వద్దకు వెళ్లడం ఎలాగో మిగతా వారికి తెలియదు.

తన ఇంట్రావర్ట్‌ నేచర్‌ వల్ల హీరోగా ఎలాంటి పరిస్థితిని అయితే ఎదుర్కొన్నాడో నిర్మాతగా అయినా అదే సమస్య కావచ్చు.

రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అయినా జనాలతో కలిసిపోవడం, తనని కలవడానికి అందరికీ మార్గం సరాళం చేయడం పవన్‌కి చేతకాలేదు. ఇప్పటికీ పవన్‌ని కలవాలంటే త్రివిక్రమ్‌ని వెంట పెట్టుకుని వెళ్లాల్సిందేనట.

నిర్మాత అంటే అలా ఒక గిరి గీసుకుని కూర్చుంటే కుదరదు కనుక పవన్‌కి అది మంచి ఆప్షన్‌ కాదని ఫాన్స్‌ ఫీలవుతున్నారు.