ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు పడటంపై భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ రియాక్ట్ అయ్యారు.
చంద్రబాబునాయుడుపై చెప్పులు పడటంపై కన్నా ట్వీట్ చేస్తూ.. 'చేసుకున్న వాడికి చేసుకున్నంత..' అంటూ వ్యాఖ్యానించారు.
''చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ.. నాడు రాష్ట్రాభివృద్ధికి,రాజధానికి నిధులు ఇచ్చి మోడీగారు రాష్ట్రానికి వస్తే నల్లబెలూన్స్ తో స్వాగతం పలికి దుష్టబుద్ధి చూపావు. నేడు నువ్వు గ్రాఫిక్స్ లో తయారు చేసిన అమరావతిలో “పెయిడ్ ఆర్టిస్టులతో”వెళ్లిన నీకు చెప్పులతో స్వాగతం లభించింది.'' అంటూ కన్నా లక్ష్మినారాయణ స్పందించారు. అమరావతికి చంద్రబాబు వెంట వెళ్లిన వారిని పెయిడ్ ఆర్టిస్టులుగా సంబోధించారు కన్నా.
ఇక చంద్రబాబుపై చెప్పులు, రాళ్లు విసిరిన వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. చెప్పు విసిరిన వ్యక్తి ఒక రైతు అని, రాయి విసిరిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి అని ఆయన ప్రకటించారు.
రాజధాని పేరుతో తమను చంద్రబాబు నాయుడు మోసం చేశారనే భావనతోనే వారు ఆ పని చేసినట్టుగా ఆయన తెలిపారు.