‘స్కిల్’ స్కామ్ కేసుతో చంద్రబాబు సింపతీ కొట్టేస్తారా?

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫీవర్ మెల్లమెల్లగా ఉపందుకుంటున్న ఇలాంటి టైమ్ లో చంద్రబాబును అరెస్ట్ చేసి వైసీపీ తప్పు చేసిందని ఓ వర్గం వాదిస్తోంది.…

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫీవర్ మెల్లమెల్లగా ఉపందుకుంటున్న ఇలాంటి టైమ్ లో చంద్రబాబును అరెస్ట్ చేసి వైసీపీ తప్పు చేసిందని ఓ వర్గం వాదిస్తోంది. ఈ కేసును చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకుంటారని, వచ్చే ఎన్నికల్లో సింపతీ కొట్టేస్తారని అంటున్నారు. ఇందులో నిజం ఎంత?

నిజంగానే స్కిల్ స్కామ్ ను చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకోగలరా? జనాల్లో సింపతీ కొట్టేయగలరా? అంత సీన్ లేదంటున్నారు వైసీపీ నేత రోజా.

“చంద్రబాబు చేసిన తప్పేంటి,  ఆయన ఎలా దొరికిపోయాడనేది ప్రజలకు అర్థమైంది. ఆయన ఎన్ని కోట్లు దోచుకున్నాడనేది ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఆయనపై సింపతీ వచ్చే అవకాశం లేదు. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ ఘటనతో కూడా సింపతీ కొట్టేద్దామని చూశాడు చంద్రబాబు. తనపై జరిగిన దాడిని చూపించి, ముందస్తు ఎన్నికలకు వెళ్లి సింపతీ కొట్టేద్దామని చూశాడు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. అప్పుడే ఆయనకు సింపతీ రాలేదు. ఇప్పుడెందుకు వస్తుంది.”

ఇలా చంద్రబాబుకు సింపతీ రాదనే విషయాన్ని తేల్చిచెబుతున్నారు రోజా. చంద్రబాబుకు బెయిల్ వచ్చినా, రాకపోయినా తమ పార్టీ పట్టించుకోదని, ప్రజలు కూడా పట్టించుకోరని అంటున్నారు.

“ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చేసిన తప్పు అందరికీ తెలుసు. అందరూ ఆడియో విన్నారు. కానీ ఆయన ఎలా మేనేజ్ చేసుకొని స్టే తెచ్చుకొని ఎలా బయటపడ్డాడో అందరికీ తెలుసు. కాబట్టి ఈ కేసులో ఆయనకు స్టే వస్తుందా, బెయిల్ వస్తుందా అనే విషయాన్ని ప్రజలు పట్టించుకోరు. చంద్రబాబు తప్పు చేశాడు, వందల కోట్లు దోచుకున్నాడనే విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారు.”

ఈ కేసుతో చంద్రబాబు సింపతీ కొట్టేస్తారనే భయం పార్టీకి లేదన్నారు రోజా. అలాంటి భయం ఉంటే, ఈ టైమ్ లో చంద్రబాబును అరెస్ట్ చేయం కదా అని ప్రశ్నిస్తున్నారు.