ఫస్ట్ టైం సగం పారితోషికమే తీసుకున్నాను

సరిగ్గా ఏడాది కిందట విడుదలవ్వాల్సిన సినిమా అర్జున్ సురవరం. ఎట్టకేలకు రేపు థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ కు సంబంధించి తన కెరీర్ లో ఎప్పుడూ ఇన్ని కష్టాలు చూడలేదంటున్నాడు హీరో నిఖిల్. అంతేకాదు, ఈ…

సరిగ్గా ఏడాది కిందట విడుదలవ్వాల్సిన సినిమా అర్జున్ సురవరం. ఎట్టకేలకు రేపు థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ కు సంబంధించి తన కెరీర్ లో ఎప్పుడూ ఇన్ని కష్టాలు చూడలేదంటున్నాడు హీరో నిఖిల్. అంతేకాదు, ఈ సినిమా కోసం ఏకంగా తన పారితోషికాన్ని సగానికి సగం తగ్గించుకున్నానని కూడా చెబుతున్నాడు.

“ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను. పారితోషికం తీసుకోకుండా ఏ సినిమా చేయలేదు. ఫస్ట్ టైమ్ అర్జున్ సురవరం సినిమాకు సగం ఎమౌంట్ మాత్రమే తీసుకొని పనిచేశాను. రెమ్యూనరేషన్ సగం కట్ చేసుకోవడమే కాకుండా, ఎక్స్ ట్రా కాల్షీట్లు కూడా  ఇచ్చాను.”

ఇదంతా కేవలం నిర్మాత క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేశానని, ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉంటే అంతా సేఫ్ గా ఉంటామని చెబుతున్నాడు నిఖిల్. అంతేకాదు.. సినిమా హిట్ అయి లాభాలు వస్తే కచ్చితంగా నిర్మాత తనకు రావాల్సిన మొత్తం ఇస్తాడనే నమ్మకం ఉందని చెబుతున్నాడు ఈ హీరో.

ఈ సందర్భంగా మరో విషయం కూడా బయటపెట్టాడు ఈ హీరో. ఇకపై తన కెరీర్ లో రీమేక్స్ ఉండవని స్పష్టం చేశాడు. తన కెరీర్ లో అర్జున్ సురవరం ఆఖరి రీమేక్ అవుతుందని ప్రకటించాడు. నిజానికి ఇది కూడా చేసేవాడ్ని కాదని, పాయింట్ బాగా కనెక్ట్ అవ్వడంతో చేయాలనిపించి చేశానని చెబుతున్నాడు. రీమేక్స్ కు తను పూర్తి వ్యతిరేకినని అంటున్నాడు.