అంతా కొత్తవాళ్లతో అసురన్ రీమేక్

వెంకీమామ తర్వాత వెంకటేష్, అసురన్ రీమేక్ చేయడం ఫిక్స్. ఈ విషయాన్ని సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. అయితే ఆయన చెప్పకపోయినా ఈ రీమేక్ ను శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేయబోతున్నాడనే విషయం…

వెంకీమామ తర్వాత వెంకటేష్, అసురన్ రీమేక్ చేయడం ఫిక్స్. ఈ విషయాన్ని సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. అయితే ఆయన చెప్పకపోయినా ఈ రీమేక్ ను శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేయబోతున్నాడనే విషయం కూడా దాదాపు ఫిక్స్. ఇప్పుడీ ప్రాజెక్టు కోసం కొత్త నటీనటుల్ని తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు కాస్టింగ్ కాల్ వచ్చేసింది.

14 నుంచి 18.. 35 నుంచి 45… ఇలా వివిధ వయసుల మధ్య ఉన్న మేల్ ఆర్టిస్టుల కోసం ప్రకటన ఇచ్చింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. పూర్తిగా మేల్ ఆర్టిస్టుల కోసం ఉద్దేశించిన ప్రకటన ఇది. ఇందులో 3 విలన్ పాత్రలు కూడా ఉన్నాయి. ఈ కాస్టింగ్ కాల్ బాధ్యతలన్నింటినీ శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించారు సురేష్ బాబు.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మహిళల కోసం ప్రత్యేకంగా ఫిమేల్ కాస్టింగ్ కాల్ ఒకటి ఇవ్వబోతున్నారు. ఇందులో కూడా వివిధ వయసుల వాళ్లను తీసుకోబోతున్నారు. అయితే ఈ కాస్టింగ్ కాల్ లో హీరోయిన్ రోల్ మాత్రం ఉండబోదు. ఆ పాత్ర కోసం శ్రియను అనుకుంటున్నారు.

కాస్టింగ్ కాల్ పూర్తయిన తర్వాత అప్పుడు సినిమాను అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారు. ఈ గ్యాప్ లో వెంకీ మామ రిలీజ్ పనుల్ని పూర్తిచేస్తారు నిర్మాత సురేష్ బాబు.