మెగా కాంపౌండ్ తో వ్యవహారం.. తప్పుకున్న హీరో

ఇదిగో కథ అంటే.. అదిగో హీరో అన్నట్టు తయారైంది టాలీవుడ్ పరిస్థితి. అసలే కథల్లేక అల్లాడుతున్న ప్రస్తుత రోజుల్లో ఓ మంచి సబ్జెక్ట్ దొరికితే చాలు దానిచుట్టూ చాలామంది హీరోల పేర్లు తెరపైకి వచ్చేస్తున్నాయి.…

ఇదిగో కథ అంటే.. అదిగో హీరో అన్నట్టు తయారైంది టాలీవుడ్ పరిస్థితి. అసలే కథల్లేక అల్లాడుతున్న ప్రస్తుత రోజుల్లో ఓ మంచి సబ్జెక్ట్ దొరికితే చాలు దానిచుట్టూ చాలామంది హీరోల పేర్లు తెరపైకి వచ్చేస్తున్నాయి. ఈమధ్య సందీప్ కిషన్ పేరు కూడా అలానే వచ్చింది. అది కూడా ఉదయ్ కిరణ్ బయోపిక్ విషయంలో.

దాదాపు 2 రోజులుగా ఉదయ్ కిరణ్ బయోపిక్ వ్యవహారం నలుగుతోంది. కొంతమంది ఈ బయోపిక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల ప్రయత్నాల్లో వాళ్లు ఉంటుండగానే మరోవైపు పుకార్లు ఊపందుకున్నాయి. ఈ బయోపిక్ లో సందీప్ కిషన్, ఉదయ్ కిరణ్ పాత్రలో కనిపించబోతున్నాడంటూ ప్రచారం ప్రారంభమైంది. దీన్ని సదరు హీరో ఖండించాడు.

“ఉదయ్ కిరణ్ బయోపిక్ కు సంబంధించి 2 రోజులుగా చాలా పుకార్లు వింటున్నాను. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. బయోపిక్ కు సంబంధించి ఎవ్వరూ నన్ను సంప్రదించలేదు. అంతేకాదు, ప్రస్తుతానికి బయోపిక్స్ చేసే ఆలోచన కూడా నాకు లేదు.”

ఇలా ఉదయ్ కిరణ్ బయోపిక్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు సందీప్. సాధారణంగా ఫలానా సినిమాను ఫలానా హీరో చేస్తున్నాడంటూ ఊహాగానాలు రావడం సహజం. అలాంటివాటికి హీరోలు స్పందించరు. కానీ ఈ బయోపిక్ విషయంలో సందీప్ వెంటనే రియాక్ట్ అవ్వడానికి ఓ రీజన్ ఉంది. ఈ బయోపిక్ లో మెగా కాంపౌండ్ వ్యవహారాలు చర్చకొస్తాయి. గతంలో ఉదయ్ కిరణ్ ను అల్లుడిగా చేసుకోవడానికి చిరంజీవి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అవన్నీ బయోపిక్ లో ఉండబోతున్నాయి.

ఈ తలనొప్పులన్నీ ఎందుకని భావించాడేమో, సందీప్ కిషన్ ఇలా ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు. సందీప్ తప్పుకోవడంతో ప్రస్తుతం ఈ బయోపిక్ చుట్టూ రాజ్ తరుణ్, నాని పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లు కూడా త్వరలోనే దీనిపై ఖండన ప్రకటన ఇవ్వబోతున్నారు.