Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సురేష్ బాబు చేతిలో ఇరుక్కున్న 'పీపుల్స్'

సురేష్ బాబు చేతిలో ఇరుక్కున్న 'పీపుల్స్'

ఇండస్ట్రీలో దగ్గుబాటి సురేష్ బాబుతో కలిసి పని చేయడం అంటే ' మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్..మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావ్' అన్న టైపు అనే సరదా కామెంట్ సదా వినిపిస్తూ వుంటుంది. ఏమైనా ఆయనకే లాభం కావాలని చూసుకుంటారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్. వెంకీమామ సినిమా వ్యవహారం చూస్తుంటే అలాగే వుంది.

ఈ సినిమాను నిర్మించిన పీపుల్స్ మీడియా వ్యవహారం పాపం, కక్కలేక, మింగలేక అన్నట్లుగా తయారైంది. ఆ సంస్థకు సురేష్ బాబుతో కలిసి ఇది రెండో సినిమా. ఆ సంస్థతో సంబంధం వున్నవారికి మూడో సినిమా. 

మొదటి సినిమా నేనేరాజు-నేనే మంత్రి కి నాన్ థియేటర్ హక్కులు బాగా వచ్చాయి. థియేటర్ మీద రిస్క్ తక్కువ వుంది. అందువల్ల సినిమాను సురేష్ బాబు చేతిలో పెట్టినా గట్టెక్కిపోయారు. రెండో సినిమా ఓ బేబీ కూడా అలాగే అయింది. నాన్ థియేటర్ హక్కుల రూపంలో మాగ్జిమమ్ వచ్చేసింది. డైరక్ట్ రిలీజ్ అయిన రిస్క్ లేకపోయింది.

కానీ వెంకీమామ అలా కాదు. దగ్గర దగ్గర 48 కోట్లకు డేకేసింది ఖర్చు. అలా అని నాన్ థియేటర్ బాగుందా అంటే అదీ లేదు. శాటిలైట్ అయింది. డిజిటల్ బేరాలు సాగుతున్నాయి. హిందీ మార్కెట్ పడిపోయింది. అది కాలేదు. దాంతో దాదాపు 35 కోట్ల రిస్క్ తో ఓన్ రిలీజ్ చేయాలి. అది చాలా అంటే చాలా రిస్క్.

పోనీ పక్కాగా ప్లాన్ చేసి, విడుదల డేట్ వేసి, సినిమాకు బజ్ తీసుకువస్తున్నారా? అంటే అదీ లేదు. ఇప్పటికీ ఇంకా మీనం మేషం లెక్కపెడుతున్నారు. సురేష్ బాబు ఓ రోజు బెంగుళూరు, ఓ రొజు అమెరికా ఇలా వుంటున్నారు. ఆయన రావాలి. కూర్చోవాలి. మీటింగ్ లు చేయాలి. డేట్ అనౌన్స్ చేయాలి. ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. 

సంక్రాంతికి సినిమాలు, ఫిబ్రవరి సినిమాలు, మార్చి సినిమాలు డేట్ లు వేసుకున్నాయి కానీ వెంకీమామ డేట్ వేసుకోలేకపోయింది. దీనికి కారణం, నిర్మాతలు అయిన పీపుల్స్ మీడియాలో ఏమీ లేకపోవడం. డేట్ పూర్తిగా సురేష్ బాబు చేతిలో వుండిపోవడం అని తెలుస్తోంది. 

సినిమాను బాగా ఆలస్యం చేసుకున్నారు. సిజి వర్క్ ల క్వాలిటీ సమస్య, రీ షూట్లు, సమంత, రానా ల ఇన్ పుట్ లు ఇలా అన్నీ కలిసి సినిమాలు ఆలస్యం చేసాయని గుసగుసలు వున్నాయి. ఇప్పటికి డిసెంబర్ 13, డిసెంబర్ 25, జనవరి 3 అంటూ రరకాల డేట్ లు వినిపిస్తున్నాయి.

సినిమా అమ్మేసుకుని వుంటే పీపుల్స్ మీడియాకు రిస్క్ వుండేది కాదు. కానీ సురేష్ బాబుతో టై అప్ అంటే అమ్మడం అంత వీజీ కాదు. దాంతో వెంకీ మామ ప్రాజెక్టు పీపుల్స్ మీడియా గొంతులో ఇరుక్కుపోయినట్లు అయింది.

వాస్తవానికి ఈ ప్రాజెక్టు పీపుల్స్ మీడియా స్వంతంగా చేసుకోవాల్సిందే. వెంకీ డేట్ ల కోసం వెళ్లి సురేష్ బాబు దగ్గర చిక్కుకుపోయినట్లు బోగట్టా. మొత్తానికి పీపుల్స్ మీడియా భవితవ్యం, వెంకీ మామ ఫలితం మీద ఆధారపడి వుంది.

వివేక్ వివరణ

అయితే వెంకీమామ గురించి బయట వినిప్తున్నవి ఏవీ నిజం కాదంటున్నారు నిర్మాతల్లో ఒకరైన కూచిభొట్ల వివేక్. సినిమాను తాము కావాలనే అమ్మలేదని, సినిమా మీదనమ్మకంతో ఓన్ రిలీజ్ కు వెళ్తున్నామని అన్నారు. సినిమా బాగా వచ్చిందని, సరైన డేట్ లేకపోతే మళ్లీ సమస్య అవుతుందని, అందుకే మార్కెట్ పరిస్థితులు పూర్తిగా అంచనా వేసాకే డేట్ వేద్దామని ఆలోచిస్తున్నామని అన్నారు. సురేష్ బాబుకు తమకు మధ్య సమస్యలు ఏవీలేవని ఆయన అన్నారు. ఈ మేరకు బయట వినిపిస్తున్న వార్తలు సరి కాదని ఆయన అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?