ఉద్ధవ్ ప్రమాణ స్వీకార ముహూర్తం మారింది!

భారతీయ జనతా పార్టీ నడిపిన పొలిటికల్ హైడ్రామ్ మధ్యలోనే తుస్సుమనడంతో.. తాపీగా డిసెంబర్ ఒకటో తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని మొదట భావించినట్టుగా ఉన్నారు ఉద్ధవ్ ఠాక్రే.  అయితే ఏమనుకున్నారో ఏమో కానీ.. ప్రమాణ…

భారతీయ జనతా పార్టీ నడిపిన పొలిటికల్ హైడ్రామ్ మధ్యలోనే తుస్సుమనడంతో.. తాపీగా డిసెంబర్ ఒకటో తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని మొదట భావించినట్టుగా ఉన్నారు ఉద్ధవ్ ఠాక్రే.  అయితే ఏమనుకున్నారో ఏమో కానీ.. ప్రమాణ స్వీకారం ముహూర్తాన్ని ప్రీ పోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 28 నే ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట. అంటే రేపే ప్రమాణ స్వీకారం ఉండబోతోందని తెలుస్తోంది.

ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని ఉద్ధవ్ ఠాక్రే కలిసిశారు. సతీసమేతంగా గవర్నర్ తో సమావేశం అయ్యి, తన చేత మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. తనకు నూటా అరవై  రెండు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, గవర్నర్ కు జాబితాను అందించారట ఉద్ధవ్.

అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఇలా శివసేన అధినేత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. శివసేన మొదటి నుంచి ఠాక్రేల గుప్పిట్లో ఉన్నా, ఆ కుటుంబ సభ్యులు ఎవరూ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు.

బాల్ ఠాక్రే హయాంలో ఒక సారి భారతీయ జనతా పార్టీ-శివసేనల ప్రభుత్వం ఏర్పడినా, దాన్నిఆయన  రిమోట్ కంట్రోల్ తో నడిపించారు. ఇప్పుడు బాల్ ఠాక్రే తనయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ, తొలిసారి రాజ్యాంగబద్ధమైన పదవిని చేపడుతున్నారు.