గత వారంలో డ్రంక్ డ్రైవ్ లో దొరికిన నటుడు ప్రిన్స్ కు ఐదు వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు. రెండు రోజుల పాటు పోలీసులు ఈ నటుడికి కౌన్సిలింగ్ ఇచ్చారట. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును విచారించిన న్యాయస్థానం ఇతడికి ఐదు వేల రూపాయల జరిమానాను విధించినట్టుగా తెలుస్తోంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం సినిమా వాళ్లకు కొత్త ఏమీ కాదు. ప్రతి వీకెండ్ లో హైదరాబాద్ లో జరిగే తనిఖీల్లో కొందరు దొరుకుతూనే ఉంటారు. కొందరి పేర్లు బయటకు వస్తూ ఉంటాయి, కొందరి పేర్లు కూడా బయటకు రావు.
మారుతి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్స్ కు ఇప్పుడు పెద్దగా అవకాశాలు కూడా ఉన్నట్టుగా లేవు. సినిమాలతో ప్రిన్స్ పేరు పెద్దగా వినిపించడం లేదు. ఇలాంటి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తో ఇతడు వార్తల్లోకి రావడం గమనార్హం!