మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన విశాఖ అపోలో ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ తుదిశ్వాస విడిచారు.
వట్టి వసంతకుమార్ 1970లో కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఉంగుటూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2009లో వైయస్ఆర్ హయంలో మంత్రిగా పని చేశారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినేట్ లో కూడా మంత్రిగా కొనసాగారు.
వట్టి వసంతకుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికల్లో పోటీ చేయలేదు. వట్టి వసంతకుమార్ 2 నవంబర్ 2018లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో జనసేన అధినేత పవన్ తో రాజకీయ భేటి కావడంతో జనసేనలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన ఆయన జనసేనలోకి వెళ్లాలేదు.