మాట జారిన మెగాస్టార్

స్టేజ్ మీద మాట్లాడడం అంత ఈజీ కాదు. చాలా జాగ్రత్తగా వుండాలి. చిన్న మాట తేడా వచ్చినా ఈ డిజిటల్ యుగంలో సవరించుకోవడం కష్టం. సారీ చెప్పాల్సిందే. నిన్నటికి నిన్న ఇలాగే జ‌రిగింది.  Advertisement…

స్టేజ్ మీద మాట్లాడడం అంత ఈజీ కాదు. చాలా జాగ్రత్తగా వుండాలి. చిన్న మాట తేడా వచ్చినా ఈ డిజిటల్ యుగంలో సవరించుకోవడం కష్టం. సారీ చెప్పాల్సిందే. నిన్నటికి నిన్న ఇలాగే జ‌రిగింది. 

వాల్తేర్ వీరయ్య వరంగల్ సభలో మెగాస్టార్ చటుక్కున ఓ మాట జారారు. సినిమాలోని ఓ సన్నివేశంలో చిన్న హీరో పోస్టర్ కు ఓ పెద్ద హీరో ముద్దు పెట్టారని అన్నారు. ఇంతకీ పెద్ద హీరో ఎవరు అంటే మెగాస్టార్. చిన్న హీరో ఎవరు అంటే రవితేజ‌. ఇలా మాట్లాడడం కచ్చితంగా తప్పే.

అసలే మన దగ్గర మల్టీ స్టారర్ లు రావడం కష్టం. అలా రావాలంటే వెళ్లి పక్క భాషల నటులను తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఇదిగో ఇలాంటి భావనలు వుంటాయి కనుకే. 17 కోట్లు ఇచ్చి కథలో కీలకపాత్ర కోసం తెచ్చుకున్న రవితేజ‌ చిన్న హీరోనా? రవితేజ‌ ఆ సినిమాలో చేయకుండా వుంటే మెగాస్టార్ పరిస్థితి ఏమిటి? హిట్ చేతిలో పడేదా?

అయినా సినిమా కోసం ఓ సీన్ నటించడం అన్నది మరీ అంత పెద్ద త్యాగమా? మిగిలిన భాషల హీరోలకు ఇలాంటి భేషజాలు లేవు. సీన్ డిమాండ్ చేస్తే ఏదైనా చేస్తారు. 

మోహన్ లాల్ లాంటి టాప్ స్టార్, ఓ సినిమాలో సీన్ డిమాండ్ చేస్తే అవతలి చిన్న ఆర్టిస్ట్ బూట్లు నోటితో టచ్ చేసిన సంఘటనలు వున్నాయి. అదీ గొప్పతనం అంటే..ఇది కాదు. మెగాస్టార్ ఇలా అంటే రేపు తనతో నటించడానికి మరే హీరో ముందుకు వస్తారు?