టాలీవుడ్ నుంచి రాబోతున్న ఆసక్తి కరమైన సినిమాల్లో పుష్ప ఒకటి. ఒక విధంగా చూసుకుంటే కరోనా రెండో ఫేస్ తరువాత వస్తున్న తొలి భారీ సినిమా ఇది. దాదాపు 180 కోట్ల బడ్జెట్. అయిదారు భాషల్లో విడుదలవుతోంది.
దర్శకుడు సుకుమార్ సినిమాలు అంటే అన్ని తరహా ప్రేక్షకులను అలరిస్తాయి. సినిమా హిట్ నా ప్లాప్ నా అన్న సంగతి పక్కన పెడితే ఆర్య, జగడం, ఆర్య 2, 100% లవ్, వన్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం ఇలా అన్ని సినిమాలు అన్ని తరహాల ప్రేక్షకులను థియేటర్ కు రప్పించినవే.
రంగస్థలం సినిమా రగ్డ్ లుక్ తో కనిపించినా ఫ్యామిలీలు వెల్లువలా వెళ్లి ఆ సినిమాను పెద్ద హిట్ చేసాయి. నేటివ్ సబ్జెక్ట్ అయినా సినిమాలో ఫ్యామిలీలు దూరంగా వెళ్లిపోయే వ్యవహారం లేదు. అయితే పుష్ప సంగతి చూస్తుంటే ఫ్యామిలీలు రావడానికి ఏ మేరకు సహకరిస్తుందో అన్న సందేహాలు ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి.
శ్రీవల్లి, సామీ పాటలు లైవ్ లీ గా వుండి హోప్ ఇచ్చాయి. కానీ కాస్కో కాస్కో మేక…బిడ్డా..ఇది నా అడ్డా పాటలు ఆ హోప్ ను తగ్గించాయి. ఇవి ప్యాన్స్ కు పట్టొచ్చు కానీ, ఫ్యామిలీలు దూరంగా వుంటాయి. పైగా తొలిసారి బన్నీ కూడా బిడ్డా..నా అడ్డా పాటలో అంత అందంగా కనిపించలేదు.
రంగస్థలం కన్నా ఎక్కడ రగ్డ్ లుక్ లో పుష్ప సినిమాను తీస్తున్నట్లు కనిపిస్తోంది. కలర్ టోన్ కానీ గెటప్ లు కానీ బాగా రఫ్ గా వుంటుంది సినిమా అని సూచిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు సినిమాలో హీరో , హీరోయిన్లు మినహా మరే క్యారెక్టర్ ఇంకా పక్కాగా బయటకు రాలేదు. జస్ట్ లుక్ లు మాత్రం వచ్చాయి.
అవన్నీ వస్తే తప్ప సినిమా మీద ఓ క్లారిటీ, ఓ అంచనా రాదు. సునీల్, రావు రమేష్, ఫాజిల్, అనసూయ లాంటి క్యారెక్టర్ల క్యారెక్టరైజేషన్, పాత్రల యాటిట్యూడ్ ఇవన్నీ బయటకు వస్తే తప్ప ఫ్యామిలీలు ఈ సినిమా పై ఏ మేరకు ఆసక్తిగా వుంటాయి అన్నది తెలియదు.