జబర్దస్త్ రూల్స్ ఇన్నీ అన్నీ కావు?

ఏళ్ల తరబడి ఇటు మల్లెమాలకు, అటు ఈటీవీకి కాసుల పంట పండిస్తోందీ కామెడీ షో. ఆరంభంలో కాస్త డబుల్ మీనింగ్ వ్యవహారం వున్నా, రాను రాను దాన్ని తగ్గించుకుని ఫ్యామిలీలకు దగ్గరయింది. అందులో నటించిన…

ఏళ్ల తరబడి ఇటు మల్లెమాలకు, అటు ఈటీవీకి కాసుల పంట పండిస్తోందీ కామెడీ షో. ఆరంభంలో కాస్త డబుల్ మీనింగ్ వ్యవహారం వున్నా, రాను రాను దాన్ని తగ్గించుకుని ఫ్యామిలీలకు దగ్గరయింది. అందులో నటించిన నటులకు బాగా క్రేజ్ తీసుకవచ్చింది. ఇలాంటి షో ఇప్పుడు కుదుపులకు గురవుతోంది. మేజర్ గా నాగబాబు జడ్జ్ గా తప్పుకోవడం ఇబ్బందిగా మారింది. 

నాగబాబుకు మారుగా వేరే జడ్జిని వెదకడం కష్టం అవుతోందని తెలుస్తోంది. ఎందుకంటే బయటకు కుర్చీలో కూర్చుని నవ్వడమే అన్నట్లు కనిపిస్తుంది కానీ, దాని వెనుక దానికి వుంటే కష్టం దానికి వుంది. ముఖ్యంగా ఆఫ్ ది షో కూడా నాగబాబు జబర్దస్త్ పార్టిసిపెంట్లను కంట్రోలు చేస్తూ వచ్చారు. షో క్వాలిటీ తగ్గకుండా చూస్తూ వచ్చారు. అవసరం అయితే జబర్దస్త్ కమెడియన్లు కమాండ్ చేస్తూ వచ్చారు. 

నాగబాబు కాబట్టి ఇదంతా నడిచింది. మరెవరికి ఇవన్నీ సాధ్యం కావడం కష్టం. అందుకే ఇప్పుడు సరైనా హోస్ట్ ఎవరా అని వెదుకులాట సాగుతోంది. ప్రస్తుతానికి సినిమాల ప్రమోషన్ల కోసం వచ్చే నిఖిల్, కార్తికేయ లాంటి హీరోల ద్వారా కొన్ని ఎపిసోడ్ లు లాగిస్తున్నారు. 

ఒకరిద్దరు సెలబ్రిటీలను అడిగారని, అయితే మల్లెమాల వైపు నుంచి ఓ అగ్రిమెంట్ కు సైన్ చేయాలని అడగడంతో వెనకడుగు వేస్తున్నారని టాక్. దాదాపు ఏడెనిమిది పేజీల అగ్రిమెంట్ కు సైన్ చేయాల్సి వుందట. దాంట్లో బోలెడు నియమ నిబంధనలు వున్నాయని బోగట్టా.

అలాగే జబర్దస్త్ షో షూటింగ్ మార్నింగ్ స్టార్ట్ అయితే అర్ధరాత్రి దాటేవరకు సాగుతుందని, అంత సేపు వుండడం సెలబ్రిటలకు కష్టం అవుతోందని, అందుకు కూడా పెద్దగా ఆసక్డి కనబర్చడం లేదని తెలుస్తోంది.