హీరో కార్తికేయ పెళ్లి చేసుకున్నాడు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ లోహిత మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈరోజు హైదరాబాద్ లో కార్తికేయ-లోహిత వివాహం అట్టహాసంగా జరిగింది. చిరంజీవి, అల్లు అరవింద్, తనికెళ్ల భరణి, సాయికుమార్ లాంటి ప్రముఖులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.
కార్తికేయ తొలి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, తన ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైంది. కార్తికేయ ఫస్ట్ డైరక్టర్ అజయ్ భూపతితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరై, దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
రీసెంట్ గా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు కార్తికేయ. ఆ వెంటనే లోహితతో ఎంగేట్ మెంట్ కూడా పూర్తయింది. రాజా విక్రమార్క ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మరోసారి సినిమా స్టయిల్ లో లోహితకు తన ప్రేమను వ్యక్తంచేశాడు. అదే రోజు పెళ్లి తేదీని కూడా ప్రకటించాడు.
కార్తికేయ-లోహిత కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకున్నారు. అప్పట్లో అది ప్రేమ అనే విషయం కూడా వాళ్లకు తెలియదంట. ఆ తర్వాత చిన్న చిన్న గొడవలతో విడిపోవడం, కలవడం కూడా జరిగాయి. అలా రోజులు గడిచేకొద్దీ ఇద్దరూ ఒకర్నొకరు బాగా అర్థం చేసుకున్నారు. ప్రేమను వ్యక్తం చేసుకోవడంతో పాటు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మూడు ముళ్లుతో ఒక్కటయ్యాడు.
లోహితను ముద్దుగా 'లో' అని పిలుస్తుంటాడు కార్తికేయ. పెళ్లి అయినంత మాత్రాన హీరోయిన్లతో తెరపై లిప్ కిస్సులు ఆపనని, ఈ విషయంలో లోహిత తనను అర్థం చేసుకుంటుందని ఇదివరకే ప్రకటించాడు ఈ హీరో.