బుట్టబొమ్మ టైటిల్ ఎప్పుడో రెండేళ్ల క్రితం ఫిక్స్ చేసారు. ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోతోంది. /నాలకు ఇలాంటి సాఫ్ట్ టైటిల్ ఎక్కుతుందా అని అనుమానం. కానీ ట్రయిలర్ చూసిన ఆ అనుమానం తీరింది. తెలిసిన విషయం అయినా చూసే ఆసక్తి కలిగేలా ట్రయిలర్ ను కట్ చేసారు.
ట్రయిలర్ తొలిసగం మామూలుగా స్టార్ట్ అయింది. కానీ ఆ తరువాత టాప్ గేర్ వేసుకుని పరుగెత్తింది. ట్రయిలర్ చూసిన తరువాత బుట్టబొమ్మ మీద కచ్చితంగా ఆసక్తి /నరేట్ అవుతుంది. అది పక్కా.
చిన్న సినిమా..కొత్త ఫేస్ లు..కొత్త లోకేషన్లు..కలిసి ట్రయిలర్ ఆరంభంలో కాస్త స్లో పేస్ అనిపించిన మాట వాస్తవం. కానీ వన్స్ అసలు కథలోకి వెళ్లాక భలే కట్ చేసారు ట్రయిలర్ అనిపించింది. నటీనటులు పక్క సరిపోయారు. ముఖ్యంగా హీరోయిన్. ట్రయిలర్ లో వున్నవి కొన్ని డైలాగులే. అవి కూడా పెద్దగా కొత్తవి అయితే కాదు. నేపథ్య సంగీతం బాగుంది.
చిన్న సినిమా అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫిబ్రవరి మొదటివారంలో వస్తోందీ సినిమా. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణం.