టాలీవుడ్ లో ఇప్పుడు అపాయింట్ మెంట్ల పర్వం నడుస్తోంది. పండగ సినిమాల విడుదలలు, వాటి కోసం రేట్లు వంటి కార్యక్రమాల కోసం డిస్కషన్లు సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అపాయింట్ మెంట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
అఖండ, ఆర్ఆర్ఆర్ రేట్ల కోసం బాలకృష్ణ, నిర్మాత దానయ్యల ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఇద్దరూ ఆంధ్ర సిఎమ్ జగన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని బోగట్టా. ఆ అపాయింట్ మెంట్ దొరకడం లేదు. కానీ మంత్రి పేర్ని నానితో డిస్కషన్ లేదా సమావేశం జరిగే అవకాశాలు వున్నాయి.
ఇదిలా వుంటే భీమ్లా నాయక్ డేట్ అన్నది హీరో పవన్ కళ్యాణ్ చేతిలోనే వుంది. అందుకోసం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆయన్ను కలవాలనుకుంటున్నారు. ఎలాగైనా ఒప్పించి భీమ్లా నాయక్ డేట్ ను మార్పించాలన్నది ఆయన ఆలోచన. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ మూడింటికి నైజాం డిస్ట్రిబ్యూటర్ ఆయనే. అందుకే ఈ ఆలోచన.
అయితే పవన్ ఇప్పట్లో అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశం లేదు. 20, 21 లేదా 21, 22 తేదీల్లో ఆయన కు రాజకీయ కార్యక్రమాలు వున్నాయి. అవి అయిన తరువాత చూద్దాం అని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తరువాత అపాయింట్ మెంట్ దొరికితే భీమ్లా నాయక్ వ్యవహారం ఓ కొలిక్కి రావచ్చు.
కానీ ఇప్పటికే భీమ్లా నాయక్ విడుదల వ్యవహారం హీట్ ఎక్కింది. ఫ్యాన్స్ గట్టి పట్టుదలగా వున్నారు. ఇలాంటి టైమ్ లో మారిస్తే వాళ్లు ఎలా రెస్పాండ్ అవుతారో అన్నది అనుమానమే.