గొదారిలో కొట్టుకు పొయేవాడికి…..

చంద్రబాబు నీతి నియమాలు సభ్యత మర్యాదల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే కాక పురాణాలు పఠించడమే. తెలుగు డ్రామాల పార్టీకి చంద్రబాబే సరైన నాయకుడు. ప్రతి ఎన్నకలో చిత్తు చిత్తుగా ఓడిపోయి అసెంబ్లీకి…

చంద్రబాబు నీతి నియమాలు సభ్యత మర్యాదల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే కాక పురాణాలు పఠించడమే. తెలుగు డ్రామాల పార్టీకి చంద్రబాబే సరైన నాయకుడు. ప్రతి ఎన్నకలో చిత్తు చిత్తుగా ఓడిపోయి అసెంబ్లీకి రావడానికి మొహం చెల్లక చేసిన డ్రామా ఇది.

చంద్రబాబు ప్రస్తుతం గతం అన్నీ నాటాకాలే. మామ అయినా, కొడుకైనా, భార్య అయినా రాజకీయం కోసం వాడుకోడమే అతని అంతిమ లక్ష్యం. షర్మిల పైన, రోజా పైన ఇంకా ఎంతో మంది ఆడవారి పైన అచ్చ మాఫియాతో అనుచిత ప్రచారం చేయించిన ఘనత చంద్రబాబుదే. 

ఆనాటి ముసి ముసి నవ్వులు నేడు ఫేక్ కన్నీటితో కప్పలేడు చంద్రబాబు. ఈ పచ్చ మాఫియా ఇప్పుడు పెడ్తున్న పెడబొబ్బలు ఆరోజు షర్మిళ పైన బురద చల్లుకుంటూ ఉన్నప్పుడే ఊహించి ఉండాల్సింది. కాలం ఎప్పుడూ ఒకేలాగ ఉండదు. బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి. మిడిసి పడితే నడుములు విరుగుతాయి.

ఈరోజు అసెంబ్లీలో జరిగింది పూర్తిగా ద్రామానే. తెలుగు డ్రామాల పార్టీకి చంద్రబాబుకీ ఇది కొట్టినా పిండే. మల్లెల బాబ్జీని గుర్తుకు తెచ్చుకోండి చాలు. పాత కాలం రోజులు కావివి, సోషల్ మీడియా యుగం. నాటకాలకు ఓట్లు రాలే రోజులు పోయాయి. కోర్టులను, వ్యవస్థలను మేనేజ్ చెయ్యడం ద్వారా పరోక్ష పాలన చేస్తూ దాన్నే గొప్పగా చాటింపు వేయించుకుంటే అసలు సిసలు అధికారం ఇక ఎప్పటికీ అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. వాళ్ళ ఆంధ్రా అధ్యక్షుడు అన్నట్టు పార్టీ లేదు బొక్కా లేదూ అన్నట్టే అవుతుంది. 

ముఖ్యమంత్రిగా మాత్రమె మళ్ళీ సభలోకి వస్తానని వాగ్దానం చేసి ఆంధ్రా ప్రజల నెత్తిపైన పాలు పోసాడు – ఎమ్మెల్యేగా గెలవడమె పూర్తి డవుట్ కుప్పం స్థానిక ఎన్నికల ఫలితాలు చూసాక ఇక ముఖ్యమంత్రి అంటే మా ఊర్లో శీనుగాడు ఎప్పుడో మూడో తరగతిలో ఆపెసిన చదువుని 40 యేళ్ళ తరవాత మళ్ళీ మొదులెట్టి గూగుల్ సీఈవో అయిననంత! చంద్రబాబు ఇక రిటైర్ అయినట్టే అనే ఊహే తెలుగు ప్రజలకు అన్ని పండగలౌ కలిసి ఒకేసారి వచ్చినంత ఆనందం!

ఈరోజు అసలు ఏమి జరిగింది? ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి ఏ విషయం పైన మాట్లాడుతున్నా క్రాస్ టాక్ చేసుకుంటూ “బాబాయి గొడ్డలి, అమ్మను చెల్లిని మోసం చేసాడు, అరగంట గంటా” లాంటి సభకు అవసరం లేని మాటలూ అంటూ వైఎస్సార్సీపీని రెచ్చగొట్టడం గురించి యెల్లో మాఫియా చెప్పకపోయినా ప్రజలకు తెలుసు. కోర్టుల్లో, పచ్చ మీడియాలో అనుక్షణం గెలవడం ప్రజా కోర్టులో ఓడిపోవడానికి కారణాలు అవుతున్నా ఏదో మత్తులో కొట్టుకుంటున్న పచ్చ బ్యాచ్ అమాయకత్వాన్ని చూస్తే వీళ్ళ గురించేనా ఇన్నేళ్ళు భయపడింది అని అనిపిస్తుంది.

గొదారిలో కొట్టుకు పొయేవాడికి గడ్డి పోచ దొరికినా అన్నట్టుంది చంద్రబాబుకి, తెలుగు డ్రామాల పార్టీకీ. 2014-2019 మధ్యలో అధికారంలో ఉండి చేసిన నిర్వాకాలకు ప్రజల్లో గెలవలేరు, కోర్టులలో వ్యవస్థలలో ఉన్న తన మనుషులతో ఇప్పుడు చేస్తున్న నిర్వాకాలకు ప్రజల్లో ఆ వ్యతిరేకత ఇంకా పెరిగిపోతున్నది. ఇక చివరకు ఆ విజనరీకి అప్పనంగా దొరికింది తన భార్య – భువనేశ్వరి. ఇన్నేళ్ళ అనుభవం ద్వారా ఆ మెలోడ్రామా ఏడుపు అర్ధం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

కానీ, ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబుని అభినందించాలి.తనకు అందరూ సమానులే వాడుకోవడంలో రోజా అయినా, తన సొంత భార్య అయినా! హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు.

గురవా రెడ్డి, అట్లాంటా