అతడు టార్చర్ పెట్టాడు – ఇలియానా

ఇలియానా డేటింగ్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. ఫారిన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఆమె సహజీవనం చేసింది. దాదాపు ఏడాది పాటు ఇద్దరూ కలిసున్నారు. ఒకదశలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారని అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.…

ఇలియానా డేటింగ్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. ఫారిన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఆమె సహజీవనం చేసింది. దాదాపు ఏడాది పాటు ఇద్దరూ కలిసున్నారు. ఒకదశలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారని అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అంతలోనే ఇద్దరూ విడిపోయారు. ఆండ్రూ తన దేశం వెళ్లిపోయాడు. ఇలియానా తన ఇనస్టాగ్రామ్ నుంచి అతడి పిక్స్ అన్నీ డిలీట్ చేసింది.

అయితే సోషల్ మీడియా నుంచి ఆండ్రూను తీసేసినా తన మనసు నుంచి మాత్రం అతడ్ని తీసేయలేకపోయింది ఇలియానా. అతడి జ్ఞాపకాల్ని మరిచిపోవడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక దశలో మానసికంగా చాలా కుంగిపోయానని, తట్టుకోలేక రోజుకు 12 టాబ్లెట్స్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అలా మానసికంగా కూడా తనను ఆండ్రూ చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పుకొచ్చింది. వారం రోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకోవడంతో ఇప్పుడంతా సెట్ అయిందని చెబుతోంది.

అతిగా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల లావెక్కానని, తగ్గడానికి జిమ్ కు వెళ్తే, ఎక్కడ తన ఫొటోలు తీసి నెట్ లో పెడతారనే భయంతో ఇంట్లోనే ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తనకు తెలిసిన పద్ధతుల్లో, ఇంట్లోనే అందుబాటులో ఉన్న జిమ్ లో కసరత్తులు చేసి తగ్గానంటోంది ఇలియానా. ప్రస్తుతం తను జిమ్ కు వెళ్లే పొజిషన్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది.

ఆండ్రూతో ఉన్న టైమ్ లో సినిమాల్ని లైట్ తీసుకున్న ఇలియానా ఇప్పుడు మరోసారి కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అయితే ఇలియానా మానసికంగా కోలుకున్నప్పటికీ ఆమెకు అవకాశాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఆమె నటించిన పాగల్ పంతి సినిమా రీసెంట్ గా రిలీజైంది. చేతిలో మరో హిందీ సినిమా మాత్రమే ఉంది.