ధరలు పెరగితే నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అదే సమయంలో ధరలు మరీ తగ్గించడానికి అవకాశం లేకుండా పెరిగితే సబ్సిడీ మీద పంపిణీ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అయితే ఇది అవకాశంగా తీసుకుని, లోకేష్ నాయుడు లాంటి అనుభవం పండిన (మంత్రిగా చేసారు కదా?) నాయకులు ప్రభుత్వం పై బురద జల్లడం మాత్రం సరికాదు.
కొత్త పంట రావడం, పాత పంట అయిపోవడం అనే సంధికాలం ప్రతి పంటకూ వస్తుంది. అది బేసిక్ గా తెలుసుకోవాల్సిన విషయం. ఈ సంధికాలంలో ఆయా సరుకుల రేట్లు పెరుగుతాయి. ఈ విషయాన్ని ఆయా సరుకుల వ్యాపారులను అడిగితే చెబుతారు. ఏయే కాలంలో ఏయే సరుకులు రేట్లు పెరుగుతాయో? అన్నది.
ఉల్లి ధరలు ఏటా ఈ విధంగా పెరగడం అన్నది కామన్. ఈ ఏడాదే ఉల్లి ధర అమాతం పెరిగిపోలేదు. ప్రతి సర్కారు ఈ సమస్యను ఎదుర్కోన్నదే. ప్రతి సర్కారు రైతు బజార్లలో ఉల్లిపాయలు అమ్మించిన వైనాలు వున్నాయి. ప్రతి సర్కారు హయాంలో జనాలు ఉల్లిపాయల కోసం క్యూలు కట్టిన రోజులు వున్నాయి.
అది మరిచి లోకేష్ బాబు ఉల్లి ధర పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వ విధానాలే కారణం అని కామెంట్ చేయడం ఆశ్చర్యకరం. ఇది బురద వేయడం తప్ప వేరు కాదు. మన రాష్ట్రంలో ఉల్లి పంట ఎంత? మన రాష్ట్రానికి నిత్యం కావాల్సిన ఉల్లి సరుకు ఎంత? ఎక్కడి నుంచి మన రాష్ట్రానికి ఉల్లి దిగుమతి అవుతుంది. ఉల్లి ధరలు మన రాష్ట్రంలోనే పెరిగాయా? ఉల్లి పంటకు కేంద్రమైన మహరాష్ట్రలో కూడా పెరిగాయా?
ఈ పాయింట్లు అన్నీ బయటకు తీసి, వాటి ప్రకారం కామెంట్ చేసి బురద జల్లితే బాగుంటుంది.అంతే కానీ సాకు దొరికింది కదా? ప్రజలను రెచ్చగొట్టేస్తే పోయే, అని ఆలోచించే వాళ్లకు ఇంకేం చెప్పాలి? ఎలా వివరించాలి? బాబు గారి హయాంలో ఎప్పుడూ ఉల్లి ధరలు స్థిరంగా వుండిపోయాయా? పెరగలేదా? రైతు బజార్లలో అమ్మించలేదా? అన్నీ మరిచిపోతే ఎలా?