కుర్రాళ్లకు డేటింగ్ సరదా..అమ్మాయి..అబ్బాయి బిజీగాలేరు. ఫుల్ ఖాళీగా వున్నారు. అందుకే ఆ ఇద్దరికీ జత కలిసిందట..హాయిగా కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ తిరిగేస్తున్నారని టాలీవుడ్ తాజా గుసగుస. విషయం ఏమిటంటే అనగనగా ఓ అమ్మాయి తెలుగు తెరపై వారసత్వం తోడుగా వెలుగుదామని అనుకుంది. కానీ లక్ కలిసిరాలేదు. ప్రస్తుతం ఖాళీ.
ఇక అబ్బాయి. చిన్న చితక సినిమాలు చకచకా చేసాడు. రియాల్టీ షో లు కూడా ట్రయ్ చేసాడు. కానీ ప్రస్తుతానికి ఫుల్ ఖాళీ. మరింకేం ఈ ఖాళీ..ఖాళీ జతకలిసిందేమో, ఇద్దరు కలిసి హాయిగా తిరిగేస్తున్నారని టాలీవుడ్ టాక్.
పేజ్ త్రీ సర్కిళ్లలో, సెల్రబిటీల వ్యవహారాల్లో ఇలాంటివి కామన్ అని సరిపెట్టేసుకోవడమే. కానీ ఒకటే సమస్య. కెరీర్ కోసం చూసుకోకుండా, ఖాళీగా వున్నామని ఇలా కలిసి కాలక్షేపం చేసేస్తే, ఇక ఇదే మిగులుతుంది తప్ప, కెరీర్ ముందుకు వెళ్లి చేతిలో సినిమాలు పడడం అన్న ఆలోచన వదిలేసుకోవాల్సి వస్తుందేమో?