ద్యేవుడా…ప‌వ‌న్ పిచ్చి పీక్‌కు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌కల్యాణ్ పిచ్చి పీక్‌కు చేరింది. ఏం మాట్లాడుతున్నాడో త‌న‌కే తెలియ‌నంత అజ్ఞానంతో ప‌వ‌న్ ఊగిపోతున్నారు. ఇలాంటి నాయ‌కుడిని భ‌రిస్తున్న జ‌న‌సేన శ్రేణుల‌కి శ‌త‌కోటి వంద‌నాలు పెట్టాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వైసీపీ నేత‌ల్ని, ముఖ్య‌మంత్రి…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌కల్యాణ్ పిచ్చి పీక్‌కు చేరింది. ఏం మాట్లాడుతున్నాడో త‌న‌కే తెలియ‌నంత అజ్ఞానంతో ప‌వ‌న్ ఊగిపోతున్నారు. ఇలాంటి నాయ‌కుడిని భ‌రిస్తున్న జ‌న‌సేన శ్రేణుల‌కి శ‌త‌కోటి వంద‌నాలు పెట్టాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వైసీపీ నేత‌ల్ని, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ని తిట్ట‌డ‌మే ఏకైక ఎజెండాగా పెట్టుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… తాను ఏం ఆశించి ఆ ప‌ని చేస్తున్నారో క‌నీసం ఆయ‌న‌కైనా అర్థ‌మ‌వుతోందా?

ఇవాళ మంగ‌ళ‌గిరిలో జ‌న‌సేన కార్యాల‌యంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌వ‌న్ ప్ర‌సంగిస్తూ పొంత‌న‌లేకుండా ఎప్ప‌ట్లాగే అడ్డ‌దిడ్డంగా తిట్ట‌డం ఆయ‌న‌కే చెల్లింది. క‌నీసం రిప‌బ్లిక్ డే నాడైనా త‌న‌ను గెలిపిస్తే, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏం చేయాల‌నే అనుకుంటున్నారో చెబితే బాగుంటుంద‌ని ప‌వ‌న్ నుంచి ఆశించ‌డం అత్యాశే అవుతుందేమో. పార్టీ నిర్మాణం అంటే త‌మాషా అనుకుంటున్నారా? క‌నీసం ప‌దేళ్లు ప‌డుతుంద‌ని సొంత వాళ్ల‌పైనే క‌స్సుబుస్సుమన‌డం గ‌మ‌నార్హం. త‌న‌కు సీఎం కావాల‌నే ఆశ లేద‌న్నారు. సీఎం అయితే ఏమ‌వుతుంద‌ని ప్ర‌శ్నించ‌డం మ‌హానుభావుడైన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కే తెలియాలి.

ముస్లిం, క్రిస్టియ‌న్ దేవుళ్ల‌ను తిట్ట‌డానికి భ‌య‌ప‌డ‌తార‌ని, ఇదే హిందువుల దేవుళ్ల‌ను మాత్రం అల‌వోక‌గా తిడుతున్నార‌ని వాపోయారు. హిందూ దేవుళ్ల‌ను దూషించొద్ద‌ని మ‌రీమ‌రీ ఆయ‌న విన్నవించుకోవ‌డం గ‌మ‌నార్హం. అప్ర‌స్తుత‌మైన ఈ అంశం గురించి ప‌వ‌న్ ప్ర‌స్తావించ‌డం వెనుక ఉద్దేశం ఏంటో ఆయ‌న‌కే తెలియాలి. మ‌రీ ముఖ్యంగా మ‌తం పేరుతో విద్వేష రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న ప‌వ‌న్ నుంచి ఇలాంటి మాట‌లు రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ప‌వ‌న్ రాజ‌కీయ అజ్ఞానానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను మ‌రోసారి విడ‌గొడ‌తామంటే తోలుతీసి విర‌గ్గొడ‌తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌రాంధ్ర‌కు రాజ‌ధాని రాకుండా చేస్తే త‌మ ప్రాంతాన్ని ప్ర‌త్యేక రాష్ట్రం చేయాల‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావు, అలాగే ప్ర‌త్యేక రాయ‌ల‌సీమ రాష్ట్రం కావాల‌ని బైరెడ్డి కోర‌డంపై ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. త‌మ ప్రాంత అభివృద్ధి, ఆత్మ‌గౌర‌వానికి సంబంధించిన డిమాండ్ల‌పై ప‌వ‌న్ నోరు పారేసుకోవ‌డం ఏంటో ఏమీ అర్థం కాదు.

ఈ ద‌ఫా ప్ర‌ధానిని క‌లిస్తే స‌జ్జ‌ల‌, వైసీపీ నేత‌ల‌పై ఫిర్యాదు చేస్తాన‌ని ప‌వ‌న్ మాట్లాడ్డం, ఆయ‌న‌లోని చిన్న‌పిల్ల‌ల చేష్ట‌ల్ని బ‌య‌ట పెట్టుకున్న‌ట్టైంది. ప‌వ‌న్‌కు మ‌తి ఉండే మాట్లాడుతున్నారా? అనే అనుమానాల్ని వైసీపీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. మంత్రి విశ్వ‌రూప్ ఇంటిని వైసీపీ నేత‌లే త‌గుల‌పెట్టార‌ని ప‌వ‌న్ ఆరోపించ‌డం విడ్డూరంగా వుంది. అదేమంటే విశ్వ‌రూప్ ఇంటిని చూడ‌డానికి సీఎం ఎందుకు పోలేద‌ని ప్ర‌శ్నించ‌డం ఆయ‌న‌లోని అస‌హ‌నం, అప‌రిప‌క్వ‌త‌కు నిద‌ర్శ‌నం. త‌న ఎన్నిక‌ల ప్ర‌చార వాహ‌నం వారాహిని అడ్డుపెట్టుకుని వైసీపీ నేత‌ల‌పై ప‌వ‌న్ చెల‌రేగిపోయారు. వారాహిని ఎవ‌ర్రా అడ్డుకునేదంటూ నోరు పారేసుకున్నారు.

జ‌గ‌న్ టీనేజ్‌లో వుండ‌గా పులివెందుల‌లో ఓ ఎస్ఐ లేదా సీఐపైనో స్టేష‌న్‌లోనే దాడి చేశాడ‌ని గుర్తు చేశారు. ఓ క్రిమిన‌ల్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడ‌నేందుకు ఆయ‌న ఈ ఉదాహ‌ర‌ణ చెప్పారు. అయ్యా సీఎం ప‌ద‌వి అనేది జ‌గ‌న్‌కు సినిమా షూటింగ్‌ల్లోనో, చంద్ర బాబు చంక నాకుతుంటేనో ఇవ్వ‌లేద‌ని ప‌వ‌న్ గుర్తించుకుంటే మంచిది. ఒక చేత్తో సొంత కులాన్ని, మ‌రో చేత్తో ఇత‌ర కులాల‌ను ద‌గ్గ‌రికి తీసుకోవాల‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. కులాల గొడ‌వ ఏంటో ప‌వ‌న్‌కే తెలియాలి. చంద్ర‌బాబు, జ‌గ‌న్ సామాజిక వ‌ర్గాల ఓటు బ్యాంక్ ఎంతో ప‌వ‌న్ ముందు తెలుసుకోవాలి. కేవ‌లం వారి కులాల ఓట‌ర్లు మాత్ర‌మే ఆద‌రిస్తే చంద్ర‌బాబు లేదా జ‌గ‌న్ సీఎంగా ఎలా అవుతార‌నే క‌నీస జ్ఞానం కూడా ప‌వ‌న్‌లో లేక‌పోవ‌డం ఆయ‌న అపార‌మైన అజ్ఞానం, అవివేకానికి నిద‌ర్శ‌నం.

మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్‌మెంట్లు ఇవ్వొద్ద‌ని వైసీపీ నేత‌ల‌కు ప‌వ‌న్ హిత‌వు చెప్పారు. రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల్ని విడ‌గొట్టింది చాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇక ఆపేయాల‌ని వైసీపీ నేత‌ల‌కు ప‌వ‌న్ వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అధిక ప్ర‌సంగం ఆపాల్సిందెవ‌రో ప‌వ‌న్ తెలుసుకుంటే మంచిది. రాజ‌కీయంగా త‌న‌కంటూ ఓ గ‌మ్యం, గ‌మ‌నం లేకుండా నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్న ప‌వ‌న్ చాలించాలా? లేక విజ‌య‌వంతంగా అధికారాన్ని సంపాదించుకున్న వైసీపీ నోర్మూసుకోవాలా? త‌న‌తో పాటు ద‌త్త తండ్రిని ఓడించి మ‌రీ జ‌గ‌న్ అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్నార‌నే అక్క‌సు ప‌వ‌న్‌లో విచ‌క్ష‌ణ‌ను చంపేస్తోందా? భ‌విష్య‌త్‌పై న‌మ్మ‌కం స‌డ‌లుతోందా? అందుకేనా ఈ పిచ్చిపిచ్చి మాట‌లు, చేష్ట‌లు? అస‌లు ప‌వ‌న్‌కు ఏమైంది? పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌నుకునే లీడ‌ర్ నుంచి రావాల్సిన మాట‌లేనా ఇవి?