బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య

వేధింపుల‌కు బుల్లితెర మ‌రో యువ‌న‌టిని కోల్పోయింది. క‌ళామ‌త‌ల్లికి గ‌ర్భ‌శోకం మిగిలింది. పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్స్ న‌టి కొండ‌ప‌ల్లి శ్రావ‌ణి మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. కుటుంబ స‌భ్యుల క‌థ‌నం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి. Advertisement…

వేధింపుల‌కు బుల్లితెర మ‌రో యువ‌న‌టిని కోల్పోయింది. క‌ళామ‌త‌ల్లికి గ‌ర్భ‌శోకం మిగిలింది. పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్స్ న‌టి కొండ‌ప‌ల్లి శ్రావ‌ణి మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. కుటుంబ స‌భ్యుల క‌థ‌నం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి.

హైద‌రాబాద్‌లోని ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని మ‌ధుర‌న‌గ‌ర్ హెచ్ 56 బ్లాక్ రెండో ఫ్లోర్‌లో శ్రావ‌ణి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఉంటోంది. శ్రావ‌ణి గ‌త ఎనిమిదేళ్లుగా తెలుగులో బాగా పాపుల‌ర్ సీరియ‌ల్స్‌గా గుర్తింపు పొందిన మౌన‌రాగం, మ‌న‌సు మ‌మ‌త‌తో పాటు ప‌లు సీరియ‌ళ్ల‌లో న‌టించింది, న‌టిస్తోంది.

కాకినాడు గొల్ల‌ప్రోలుకు చెందిన దేవ‌రాజురెడ్డితో టిక్‌టాక్ ద్వారా శ్రావ‌ణికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం స్నేహంగా మారింది. దేవ‌రాజురెడ్డి దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. కొంత కాలంగా శ్రావ‌ణిని అత‌ను వేధించ‌డం ప్రారంభించాడు. దీంతో శ్రావ‌ణి తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. ఎంత వేడుకున్నా అత‌ని వేధింపులు ఆగ‌క‌పోవ‌డంతో జీవితంపై విర‌క్తి చెందిన శ్రావ‌ణి మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

అయితే ఎంత సేప‌టికీ బాత్రూం నుంచి  శ్రావణి బ‌య‌టికి రాకపోవడంతో  కుటుంబ సభ్యులకు అనుమానం వ‌చ్చి పిలిచారు. శ్రావ‌ణి నుంచి ఎలాంటి స్పంద‌నా రాక‌పోవడంతో ఆందోళ‌న గురైన కుటుంబ స‌భ్యులు బాత్రూం త‌లుపులు ప‌గుల‌గొట్టి చూడ‌గా విగత జీవిగా క‌నిపించింది. ఎలాగైనా శ్రావ‌ణిని కాపాడుకోవాల‌నే త‌ప‌న‌తో వెంటనే యశోద హాస్పిటల్‌కు తరలించారు.

వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. దీంతో శ్రావ‌ణి కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీర య్యారు. దేవరాజు రెడ్డి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని శ్రావణి కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

దేవరాజును కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేశారు.  కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్టు  ఎస్ఆర్ నగర్  పోలీసులు చెప్పారు.