న‌డ‌క దారిలో కంచె ఏర్పాటుపై టీటీడీ క‌స‌ర‌త్తు!

తిరుమ‌ల న‌డ‌క మార్గంలో భ‌క్తుల ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌పై టీటీడీ సీరియ‌స్‌గా దృష్టి సారించింది. ఇప్ప‌టికే భ‌క్తుల‌కు క‌ర్ర‌ల పంపిణీకి టీటీడీ శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. క‌ర్ర‌లు ఇవ్వ‌డంతోనే భ‌క్తుల భ‌ద్ర‌త బాధ్య‌త‌లు తీరిపోయిన‌ట్టు…

తిరుమ‌ల న‌డ‌క మార్గంలో భ‌క్తుల ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌పై టీటీడీ సీరియ‌స్‌గా దృష్టి సారించింది. ఇప్ప‌టికే భ‌క్తుల‌కు క‌ర్ర‌ల పంపిణీకి టీటీడీ శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. క‌ర్ర‌లు ఇవ్వ‌డంతోనే భ‌క్తుల భ‌ద్ర‌త బాధ్య‌త‌లు తీరిపోయిన‌ట్టు కాద‌ని, కొంత వ‌ర‌కూ ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చేందుకు దోహ‌దం చేస్తాయ‌ని టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి చెప్పిన సంగ‌తి తెలిసిందే. న‌డ‌క దారి భ‌క్తులు క్రూర‌మృగాల బారిన ప‌డ‌కుండా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో ఆలోచిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.

ఇప్ప‌టికే మూడు నెల‌ల కాలంలో ఐదు చిరుత‌ల‌ను టీటీడీ, అట‌వీఅధికారులు సంయుక్తంగా ప‌ని చేసి ప‌ట్టుకున్నారు. మ‌రిన్ని చిరుత‌లు సంచ‌రిస్తున్నాయ‌ని సీసీ కెమెరాల ద్వారా ప‌సిగ‌ట్టారు. దీంతో న‌డ‌క దారి భ‌క్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు కంచె ఏర్పాటుకు టీటీడీ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇనుప కంచె ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వ అనుమ‌తిని టీటీడీ కోరింది.

అయితే కంచె ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల చిరుత‌ల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించిన‌ట్టు అవుతుంద‌నే అభిప్రాయాన్ని అట‌వీశాఖ అధికారులు కొట్టి పారేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 12న ఎక్స్‌పర్ట్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. అలిపిరి, శ్రీ‌వారి మెట్టు నడకమార్గాల్లో పర్యటించి నివేదిక అందజేస్తారి స‌మాచారం. 

ఈ క‌మిటీ నివేదిక ఆధారంగా న‌డ‌క మార్గాల్లో ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాలో టీటీడీ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం వుంది. మ‌రోవైపు ఆప‌రేష‌న్ చిరుత కార్య‌క్ర‌మాన్ని అట‌వీశాఖ‌తో క‌లిసి టీటీడీ కొన‌సాగిస్తోంది.  భ‌క్తుల భ‌ద్ర‌తే మొద‌టి ప్రాధాన్యం కింద చిరుత‌ల‌ను పట్టుకుంటామ‌ని టీటీడీ ఉన్న‌తాధికారులు చెప్ప‌డం విశేషం.