ఆ బాధ నాకు ఇంకా ఉంది- లావణ్య త్రిపాఠి

ప్రస్తుతం అవకాశాల్లేక కిందామీద పడుతోంది లావణ్య త్రిపాఠి. ఒకప్పుడు వచ్చిన అవకాశాల్ని వదులుకున్న ఈ బ్యూటీ.. అలా వదులుకున్న ఓ బ్లాక్ బస్టర్ మూవీపై తాజాగా స్పందించింది. అదే గీతగోవిందం సినిమా. అవును.. ఈ…

ప్రస్తుతం అవకాశాల్లేక కిందామీద పడుతోంది లావణ్య త్రిపాఠి. ఒకప్పుడు వచ్చిన అవకాశాల్ని వదులుకున్న ఈ బ్యూటీ.. అలా వదులుకున్న ఓ బ్లాక్ బస్టర్ మూవీపై తాజాగా స్పందించింది. అదే గీతగోవిందం సినిమా. అవును.. ఈ సినిమాలో ముందుగా లావణ్య త్రిపాఠీనే అనున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా వదులుకున్న అంశంపై తాజాగా రియాక్ట్ అయింది లావణ్య.

“అవును.. ఆ స్క్రిప్ట్ ముందుగా నా వద్దకే వచ్చింది. ఆ సినిమా నాకు నచ్చింది కూడా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. కొంచెం బాధగానే ఉంది.” అర్జున్ సురవరం మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టింది లావణ్య.

ఇలా గీతగోవిందం సినిమా మిస్ అవ్వడంపై కాస్త బాధ పడింది లావణ్య. ఈ ముద్దుగుమ్మ నో చెప్పిన తర్వాత ఆ సినిమా కోసం అను ఎమ్మాన్యుయేల్ ను సంప్రదించారు. ఆమె కూడా కాల్షీట్ల సమస్య కారణంగా తిరస్కరించింది. అలా ఇద్దరు రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ ను ఓకే చేసిన రష్మిక.. గీతగోవిందం సినిమాతో స్టార్ అయిపోయింది.

అయితే ఆఫర్ మిస్ అయినా తనదైన శైలిలో దాన్ని కవర్ చేసుకుంది లావణ్య. తను అవకాశాల వెంట పడనని, తనకు నచ్చినవి మాత్రమే ఎంపిక చేసుకుంటానని అంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. రీసెంట్ గా సందీప్ కిషన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. A1-ఎక్స్ ప్రెస్ టైటిల్ తో ఇది షూటింగ్ జరుపుకుంటోంది.