టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పక్షపాత బుద్ధి ఇటీవల కాలంలో వెంటనే బయటపడుతోంది. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఏ మాత్రం బెరుకు లేకుండా తప్పులను వెనుకేసుకొస్తోంది. ఆ తప్పులే టీడీపీని కోలుకోలేకుండా చేస్తున్నాయి. ఉదాహరణకు అంతర్వేది ఘటనపై ట్విటర్ వేదికగా చంద్రబాబు నిజ స్వరూపాన్ని నగ్నంగా ఆవిష్కరిస్తోంది.
ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజా ట్వీట్ చంద్రబాబును దిగంబరంగా నిలిపింది. అంతర్వేది ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేయడాన్ని విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. అంతర్వేదిలో రథం కాలిపోతే …. యుద్ధ ప్రాతిపదికన స్పందించిన చంద్రబాబు…విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇలాంటి చొరవ ఎందుకు చూపలేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. విజయసాయిరెడ్డి ట్వీట్ ఏంటో చూద్దాం.
‘అంతర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజనిర్ధారణ కమిటీ వేశారు చంద్రబాబు గారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమా దంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఇదే రీతిలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. అయినప్పటికీ టీడీపీ ఎక్కడా సమాధానం ఇవ్వాలనే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.