ప్రముఖ దర్శకుడు, నటుడు మారిముత్తు గుండెపోటుతో కన్నుముశారు. ఓ సీరియల్‌కు డబ్బింగ్ చెబుతూ ఆయన కుప్పకూలిపోవడంతో.. వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఇటీవల బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విక్రమ్, జైలర్ సినిమాల్లోనూ కీలక పాత్రలు పొషించారు.
అజిత్ హీరోగా ఎస్జే సూర్య దర్శకత్వంలో రూపొందిన వాలి సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు మారిముత్తు. వందకుపైగా సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కన్నుమ్ కన్నుమ్, పులివాల్ అనే రెండు తమిళ సినిమాల్ని తెరకెక్కించారు. కమల్‌హాసన్ ఇండియన్ 2లో నటిస్తున్నారు. రాజ్‌కిరణ్, మణిరత్నం, వసంత్, సీమాన్, ఎస్జే సూర్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
మారి ముత్తు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నేరుగా తెలుగులో ఆయన నటించకపోయినా.. పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించాడు. చినబాబు, పందెం కోడి-2, సుల్తాన్, డాక్టర్ వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు. శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2లోనూ మారిముత్తు నటించాడు.